Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంఎస్‌జీ ఫుడ్ అతిగా తీసుకుంటే?

ఎంఎస్‌జీ హోటల్స్ గురించి వినే వింటాం. ఎంఎస్‌జీ కిచెన్ అంటూ ప్రస్తుతం హోటల్ వ్యాపారం బాగానే సాగుతోంది. ఎంఎస్‌జీ అనే రసాయనంలో 78 శాతం ఆమ్లాలు, 22 శాతం సోడియం ఉంది. ఈ రసాయనాలు ఆకలిని పెంచుతాయి. ఎంఎస్‌జీ

ఎంఎస్‌జీ ఫుడ్ అతిగా తీసుకుంటే?
, మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (13:19 IST)
ఎంఎస్‌జీ హోటల్స్ గురించి వినే వింటాం. ఎంఎస్‌జీ కిచెన్ అంటూ ప్రస్తుతం హోటల్ వ్యాపారం బాగానే సాగుతోంది. ఎంఎస్‌జీ అనే రసాయనంలో 78 శాతం ఆమ్లాలు, 22 శాతం సోడియం ఉంది. ఈ రసాయనాలు ఆకలిని పెంచుతాయి. ఎంఎస్‌జీ రుచిని ఇవ్వడంతో పాటు మళ్లీ మళ్లీ తినాలనే ఆసక్తిని రేపుతుంది. కానీ ఎంఎస్‌జీ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఎంఎస్‌జీ మెదడు నరాలను అనవసరంగా ఉత్తేజపరుస్తాయి. తద్వారా నరాలకు సంబంధించిన రుగ్మతలు తప్పవు. ధూమపానం, మద్యపానం తరహాలో ఎంఎస్‌జీ వంటకాలను తీసుకుంటే ఆ.. వంటకాలను మళ్లీ మళ్లీ తినాలనే అలవాటుకు బానిసవుతారు. ఎంఎస్‌జీ చేర్చిన ఆహారాలను రోజుకు 3 గ్రాములు మించి తీసుకోకూడదు. ఎంఎస్‌జీ ఆహారం మోతాదుకు మించితే మెడనొప్పి, తలనొప్పి, గుండెపోటు, తల తిరగడం, శ్వాస సంబంధిత రుగ్మతలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఎంఎస్‌జీ కలిపిన ఆహార పదార్థాలు తీసుకునే చిన్నారుల్లో పెరుగుదలకు కారణమయ్యే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. పిల్లల్లో పెరుగుదల వుండదు. ఎత్తు పెరగరు. బరువు మాత్రం పెరిగిపోతారు. ఎంఎస్‌జీ ద్వారా మెదడులో ఆర్క్యుయేట్ న్యూక్లెస్ అనే ప్రాంతానికి దెబ్బని.. ఇది ఒబిసిటీకి కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంఎస్‌జీ ద్వారా మెదడుకే కాకుండా చిన్నపేగులు, కాలేయానికి ముప్పు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే ఎంఎస్‌జీ రసానయం కలిపిన ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
అంతేగాకుండా రెస్టారెంట్ల ఆహారానికి దూరంగా వుంటూ.. సరైన సమయానికి పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆయుర్దాయం పెరుగుతుంది. బర్గర్లు, పిజ్జాలు వంటి జంక్ ఫుడ్స్ కాకుండా రసాయనాలు లేని ఆహారాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. చిన్న వయస్సులోనే సంప్రదాయ వంటకాలను రుచి చూపించాలి. పండ్లు, కూరగాయలను తినేందుకు అలవాటు చేయాలి. తద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్యాలు దరి చేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెయ్యిని తరచుగా ఆహారంలో చేర్చుకుంటే?