బొప్పాయి ఆకుల జ్యూస్‌తో ''ఆ'' నొప్పులు తగ్గుతాయట...
బొప్పాయి పండ్లలో విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పలు అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. బొప్పాయి ఆకుల్లో పపైన్ ఎంజైములు ఎన్నో ఉన్నాయి. ఈ ఆకులను జ్యూస్ రూపంలో తీసుకుంటే శరీరంలో ప్
బొప్పాయి పండ్లలో విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పలు అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. బొప్పాయి ఆకుల్లో పపైన్ ఎంజైములు ఎన్నో ఉన్నాయి. ఈ ఆకులను జ్యూస్ రూపంలో తీసుకుంటే శరీరంలో ప్లేట్‌లెట్ల్ సంఖ్య పెరుగుతుంది. బొప్పాయి ఆకుల్లో యాంటీ మలేరియా వంటి గుణాలున్నాయి.
కాలేయాన్ని శుభ్రం చేయడంలో బొప్పాయి చాలా ఉపయోగపడుతుంది. లివర్ సిరోసిస్, ఇతర కాలేయ వ్యాధుల నుండి కాపాడుతుంది. బొప్పాయి ఆకుల్లోల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ప్రేగులోని , పొట్టలోని మంటను తగ్గిస్తాయి. ఈ బొప్పాయి జ్యూస్ పెప్టిక్ అల్సర్లను తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బొప్పాయి ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి.
శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. బొప్పాయి ఆకులలోని యాంటీ ఆక్సిడెంట్స్ కిడ్నీ దెబ్బతినకుండా కాపాడుతుంది. దీంతో పాటు ఫ్యాటీ లివర్ సమస్యలను నివారిస్తుంది. ఈ బొప్పాయి జ్యూస్ తరచుగా తీసుకోవడం వలన మహిళలకు బహిష్టు సమయంలో వచ్చే నొప్పులు తొలగిపోతాయి. ఈ ఆకుల్లోని విటమిన్ సి, ఎలు చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.