Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొడిదగ్గు మిమ్మల్ని బాధిస్తోందా..ఈ చిట్కాలను పాటించండి..

Webdunia
గురువారం, 16 మే 2019 (15:27 IST)
సాధారణంగా మనలో చాలా మందికి కాలంతో సంబంధం లేకుండా పొడి దగ్గు వస్తుంటుంది. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు చాలా మంది పొడిదగ్గుతో సతమతమవుతూనే ఉంటారు. మనం తీసుకునే శ్వాస క్రియలకు ఆటంకం కలిగినప్పుడు దగ్గు వస్తుంది. 
 
వాతావరణ మార్పుల వల్ల, శీతలపానీయాలను ఎక్కువగా తాగడం వలన ఇది ఎక్కువగా వస్తుంది. అయితే పొడి దగ్గు తగ్గాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. దీంతో దగ్గు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో మీరూ చూడండి..
 
* పొడి దగ్గు బాధిస్తున్నప్పుడు కాస్త అల్లం టీ తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
* అర టీ స్పూన్ శొంఠి పొడిని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
* చిటికెడు పసుపు, నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకోవాలి.
 
* కరక్కాయ కూడా పొడిదగ్గును తగ్గించడంలో దోహదపడుతుంది. కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతుంటే పొడి దగ్గు వెంటనే తగ్గిపోతుంది.
 
* తమలపాకులను నమలడం వల్ల కూడా పొడి దగ్గు నుంచి విముక్తి పొందవచ్చు.
* తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా కూడా దగ్గును తగ్గించుకోవచ్చు.
 
* పొడి దగ్గుతో బాధపడుతుంటే అర టీ స్పూన్ ఇంగువపొడి, ఒక టీ స్పూన్ తాజా అల్లం రసం, ఒక టేబుల్ టీ స్పూన్ తేనెలను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా  తీసుకోవడం వల్ల దగ్గును తగ్గించుకోవచ్చు.
* పాలలో మిరియాల పొడిని వేసుకొని తాగితే దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భయపడటం లేదు... సభలో చర్చ జరగాలని కోరుతున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా మృతి

అప్పులు తీర్చలేక సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

Zika Virus: నెల్లూరులో ఐదేళ్ల బాలుడికి జికా వైరస్.. చెన్నైలో ట్రీట్మెంట్

కాకినాడ SEZ కేటాయింపులు: విజయసాయి రెడ్డికి ఈడీ కొత్త నోటీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments