Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో వేడి పాలలో బెల్లం కలిపి తాగితే?

ఆరోగ్యంగా ఉండటానికి చాలామంది ప్రతి రోజు పాలు తాగుతుంటారు. వట్టి పాలు తాగలేం కదా.. అందుకే అందులో కొద్దిగా చక్కెర కలుపుకొని తాగుతుంటారు. కానీ ఒకప్పుడు పల్లెల్లో ఎక్కువగా పాలు, టీ , కాఫీల్లో బెల్లాన్ని వాడేవారు. ఇప్పుడు మాత్రం పంచదార వేస్తున్నారు. కాని

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (19:43 IST)
ఆరోగ్యంగా ఉండటానికి చాలామంది ప్రతి రోజు పాలు తాగుతుంటారు. వట్టి పాలు తాగలేం కదా.. అందుకే అందులో కొద్దిగా చక్కెర కలుపుకొని తాగుతుంటారు. కానీ ఒకప్పుడు పల్లెల్లో ఎక్కువగా పాలు, టీ , కాఫీల్లో బెల్లాన్ని వాడేవారు. ఇప్పుడు మాత్రం పంచదార వేస్తున్నారు. కాని చక్కెరకు బదులు బెల్లం కలుపుకొని తాగటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. చలికాలంలో వేడివేడి పాలల్లో బెల్లం వేసుకుని తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  
 
చలికాలం జీర్ణక్రియ నెమ్మదిగా వుంటుంది. అందుకే వేడివేడి పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వలన జీర్ణ క్రియ చాలా మెరుగుపడుతుంది. బెల్లం వలన పేగు సంబంధిత సమస్యలు కూడా నయమవుతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి ఇబ్బందులు తొల‌గిపోతాయి.
 
చల్లదనానికి ఎన్నో లక్షల రకాల బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. అవి శరీర రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. అందుకే దగ్గు, జలుబులు వస్తుంటాయి. ఎవరికైనా ఆస్తమా, సైనస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే చలికాలం తిరగబెడతాయి. ఆయా బ్యాక్టీరియాల పనిపట్టేందుకు, రెసిస్టెన్స్ ఇచ్చేందుకు వేడివేడి పాలల్లో బెల్లం కలుపుకుని తాగాలి. పాలు ఆరోగ్యానికి చాలా మంచివి అలాగే బెల్లం కూడా చాలా మంచింది. పాలు, బెల్లం మిశ్రమం ఒక అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే పోషాకాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని అనారోగ్యాన్ని తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments