మెంతి ఆకులతో ఈ అనారోగ్య సమస్యలన్నీ పరార్

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (23:22 IST)
జీర్ణాశయ సంబంద సమస్యలను ఇంటి చిట్కాలతోనే సరిచేయవచ్చు. చాలామంది కడుపులో కాస్త ఇబ్బంది అనిపించగానే మెడికల్ షాపులకు వెళ్లి ఏవో మాత్రలు మింగేస్తుంటారు. కానీ చిన్నచిన్న సమస్యలను ఇంటివైద్యంతోనే అడ్డుకోవచ్చు. అలాంటివి కొన్నింటిని చూద్దాం.
 
మెంతి ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి. అంతేకాకుండా‌ ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.
 
గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖం మీద వైట్‌హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్‌హెడ్స్ బారి నుంచి విముక్తి అవ్వచ్చు.
 
పైత్యం అధికంగా ఉన్నప్పుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. కామెర్లు వచ్చిన వారికి, లివర్‌ సిర్రోసిస్‌‌తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. 
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. ఈ ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

చిత్తూరు మేయర్ దంపతుల హత్య ఎలా జరిగిందంటే?

మొంథా తుఫాను- విశాఖపట్నంలో కూరగాయలు, సీఫుడ్స్ ధరలకు రెక్కలు

Azharuddin: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్ అజారుద్ధీన్

చిత్తూరు మేయర్ దంపతులు హత్య కేసు : ఐదుగురుకి ఉరిశిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

Mickey J. Meyer : నేను రెడీ కోసం మిక్కీ జె మేయర్ మ్యూజిక్

Sreeleela: బాలీవుడ్‌లో శ్రీలీలకు భారీ డిమాండ్.. అరుంధతిగా కనిపించబోతుందా?

తర్వాతి కథనం
Show comments