చల్లచల్లగా శీతాకాలం వచ్చేస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (15:47 IST)
కార్తీక మాసం ముగుస్తుందనగానే చల్లటి గాలులు ప్రారంభమవుతాయి. శీతాకాలం వచ్చేస్తుంది. ఈ కాలంలో శరీరంలో మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. ఈ కాలంలో శరీరం పొడిబారినట్లవుతుంది. కొందరిలో చర్మం చిట్లుతుంది. పెదవులు పగిలిపోతుంటాయి. ముఖ్యంగా మహిళలు శరీరం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి.

 
పొడి చర్మం కలిగిన వారైతే... రెండు టీ స్పూన్లు బాదంనూనె, రెండు టీస్పూన్ల బాదం పొడి, రెండు టీ స్పూన్లు అరటి ముక్కలు, రెండు టీస్పూన్లు గ్లిజరిన్ లేదా తేనే, నాలుగు టీ స్పూన్లు పాలు కలిపి మెత్తని గుజ్జు మాదిరి పేస్ట్ చేసి ముఖానికి, మెడకు మృదువుగా మసాజ్ చేస్తూ పట్టించి కొద్దిసేపు వుంచి కడిగేయాలి. చర్మం మృదువుగా మారుతుంది. శీతాకాలంలో అద్భుతంగా పనిచేస్తుంది. చేతులు, పాదాలకు కూడా అప్లయ్ చేయవచ్చు. 

 
జిడ్డు చర్మం కలిగిన వారు.. రెండు టీ స్పూన్లు ఓట్‌మీల్‌ పొడి, నాలుగు టీ స్పూన్లు మజ్జిగ, రెండు టీ స్పూన్లు గంధం పొడి కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించి, గోరువెచ్చని నీటితో కడిగేస్తే జిడ్డు చర్మం పోయి కాంతివంతంగా ఉంటుంది. 

 
ఇక శిరోజాల సంరక్షణకు.. ఒక కప్పు బొప్పాయి గుజ్జు, అరకప్పు కొబ్బరి క్రీమ్ లేదా పాలు, పావు కప్పు కొబ్బరినూనె, పావు కప్పు బీట్ రూట్ జ్యూస్ కలిపి పేస్టు తయారు చేసుకుని జుట్టుకు,  పట్టించాలి. పదినిమిషాలాగి హెర్బల్ షాంపూతో వాష్ చేసుకోవాలి. శీతాకాలంలో ఈ ప్యాక్ జుట్టును పరిరక్షిస్తుంది. జుట్టురాలడాన్ని, చుండ్రును తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

తర్వాతి కథనం
Show comments