Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లటి ఛారలు ఎందుకు వస్తాయో తెలుసా..?

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (15:42 IST)
పుష్టికరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనడంలో సందేహం లేదు. ఆరోగ్యంతోపాటు చర్మసౌందర్యం కూడా బాగుంటే మరింత అందంగా తయారవుతారు. నేటి ఉరుకు పరుగులతో కూడుకున్న జీవితంలో చాలామంది తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీంతో చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఉదాహరణకు నవ్వ, చర్మం పొడిబారడం, కళ్ళకింద నల్లటి చారలు ఏర్పడడం జరుగుతుంటుంది. 
 
అలాగే హార్మోన్ల లోపంతోనూ చర్మంపై ప్రభావం ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి కింద పేర్కొనబడిన ఆహార నియమాలను పాటిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ప్రతి రోజు వీలైనంత వరకు ఎక్కువగా నీరు సేవించాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన చర్మం కోసం నీరు దివ్యమైన ఔషధం. నీరు తీసుకోవడం వలన మీరు తాజాగా తయారవ్వడమే కాకుండా మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో చాలా ఉపయోగపడుతుంది. 
 
ఏవిధంగానైతే శరీరానికి ప్రాణవాయువు అవసరమో అదేవిధంగా శరీర చర్మానికి విటమిన్స్ కూడా అంతే అవసరమౌతాయి. చర్మసౌందర్యాన్ని పెంపొందించేందుకు కొన్ని విటమిన్లు అవసరమౌతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
1. విటమిన్ సీ అన్ని రకాల పండ్లలో లభిస్తుంది. ఉదాహరణకు నారింజ, నిమ్మకాయ, చీనీపండు.
 
2. విటమిన్ ఏ.. బొప్పాయి, కోడిగుడ్డు
 
3. విటమిన్ బి.. ఇది పండ్లతోపాటు ఆకుకూరల్లోను పుష్కలంగా లభిస్తుంది.
 
4. విటమిన్ ఇ.. వేరుశెనగ, ఇతర నూనె గింజల్లో లభిస్తుంది.
 
చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కేవలం పండ్లు, ఆకుకూరలతోపాటు నీరు సేవిస్తుంటే చాలని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments