Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాల్షియం కావాలా నాయనా... ఐతే ఇవి తీసుకోవాల్సిందే...

ఈ రోజులలో చాలామందికి ఎముకలు బలహీనంగా ఉండి కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. దీనికి కారణం మనం తీసుకునే ఆహారంలో సరియైన పోషకాలు లేకపోవటమే. దీనివలన ఎముకలు పెళుసుగా మారిపోతాయి. దీనిని భర్తీ చేయాలంటే కాల్షియ

Webdunia
సోమవారం, 21 మే 2018 (19:54 IST)
ఈ రోజులలో చాలామందికి ఎముకలు బలహీనంగా ఉండి కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. దీనికి కారణం మనం తీసుకునే ఆహారంలో సరియైన పోషకాలు లేకపోవటమే. దీనివలన ఎముకలు పెళుసుగా మారిపోతాయి. దీనిని భర్తీ చేయాలంటే కాల్షియం ఎక్కువుగా ఉన్న ఆహార పదార్ధాలను, పాల ఉత్పత్తులను రోజువారి చేర్చుకోవటమే.
 
1. పాలు, పెరుగు, జున్నులో కాల్షియం శాతం ఎక్కువుగా ఉంటుంది. వీటిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
2. రాగి పిండిని జావా లాగా చేసి ప్రతి రోజు త్రాగటం వలన దానిలో ఉన్న పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచి, పిల్లలలో ఎముకల పెరుగుదలకు కావలసిన కాల్షియంను అందిస్తాయి.
 
3. పాలకూర, తోటకూర, బ్రోకలి లాంటి ఆకుకూరల్లో డి విటమిన్, కాల్షియం ఎక్కువుగా ఉండి అది ఎముకలను పటిష్టంగా ఉంచుతుంది. కనుక వారంలో మూడుసార్లయినా ఆకు కూరలను తినటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. 
 
4. యాలుకలలో పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు యాలుకల పొడిని వేసుకొని ప్రతిరోజు త్రాగటం వలన ఎముకలు ధృడంగా తయారవుతాయి.
 
5. అంజీరపండ్లను, నారింజ పండ్లను క్రమంతప్పకుండా తీసుకోవాలి. దీనిలో ఉన్న కాల్షియం రోగనిరోధక శక్తిని పెంచటమే కాకుండా ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments