Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నొప్పుల ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు?

సాధారణంగా ప్రతి మానవుడు ఎన్నో భిన్న రకాల నొప్పులను అనుభవిస్తుంటారు. గాయాల వల్ల శరీరం పొందే అనుభూతినే నొప్పి అని చెప్పొచ్చు. చాలా సందర్భాల్లో ఇదెంతో బాధాకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.

Advertiesment
నొప్పుల ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు?
, సోమవారం, 21 మే 2018 (10:55 IST)
సాధారణంగా ప్రతి మానవుడు ఎన్నో భిన్న రకాల నొప్పులను అనుభవిస్తుంటారు. గాయాల వల్ల శరీరం పొందే అనుభూతినే నొప్పి అని చెప్పొచ్చు. చాలా సందర్భాల్లో ఇదెంతో బాధాకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. వాస్తవానికి ఈ నొప్పి అనేది శరీరం అనుసరించే రక్షణాత్మక యంత్రాంగంలో భాగం. సమస్యపై సంబంధిత శరీర భాగాన్ని అప్రమత్తం చేసే ప్రక్రియ ఇది. 
 
ఏదైనా భాగంలో నొప్పి ఉందంటే అక్కడ ఏదో సమస్య నెలకొందని అర్థం. ఆ సమస్యను గుర్తించి సంబంధిత కణాజలం మరమ్మత్తు పూర్తయ్యే వరకు ఈ నొప్పి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కణజాల నష్టం లేకున్నా తలనొప్పి, లోబ్యాక్‌ పెయిన్‌ లాంటి నొప్పులు ఉంటాయి. అందుకే నొప్పి అనేది కేవలం ఓ అనుభూతికి చెందిన ప్రక్రియ మాత్రమే కాదు దాని వెనుక మరెన్నో కారణాలు, విశేషాలు ఉంటాయి. 
 
అయితే, ఈ నొప్పుల నివారణకు కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటిస్తే పాక్షికంగా ఉపశమనం పొందవచ్చు. కొన్ని రకాల దీర్ఘకాలిక, తీవ్రమైన నొప్పులకు శ్వాస వ్యాయామాలు, యోగా, ధ్యానం ఉపశమనం వంటివి చేయడం వల్ల కాస్త రిలీఫ్ కలుగుతుంది. అలాగే అదే రకమైన నొప్పులతో బాధపడేవారితో స్నేహం పెంచుకుంటే వారి నుంచి మీకు అవసరమైన సమాచారం, చిట్కాలు పొందే అవకాశం ఉంటుంది.
 
నొప్పులతో ఎక్కువగా బాధపడేవారు వివిధ రకాల హాబీలను అలవరచుకోవడం మంచింది. సంగీతం వినడం, బాగా రిలాక్స్‌ కావడం, ఒత్తిడి తగ్గించుకునే విధానాలను పాటించడం వల్ల మీ నొప్పిని సగం మేరకు తగ్గిస్తాయి. 
 
మనస్సులో ఎంతో ఆహ్లాదాన్ని ఊహించుకోవడం ద్వారా నొప్పి నుంచి కొంత ఉపశమన భావన పొందవచ్చు. పూలతో నిండిన ఉద్యానవనంలో పక్షుల ధ్వనులు వింటున్నట్లుగా, జలపాతం చూస్తున్నట్లుగా, చల్లటి గాలి తాకుతున్నట్లుగా ఊహించుకోవడం కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. ఇలా పలు రకాల విధానాలు అవలంభిచడం వల్ల కొంతమేరకైనా ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లంతో మధుమేహం పరార్.. వడదెబ్బ తగలకుండా వుండాలంటే..?