అల్లంతో మధుమేహం పరార్.. వడదెబ్బ తగలకుండా వుండాలంటే..?
అల్లంతో మధుమేహాన్ని నియంత్రించవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్స్, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జలుబు, దగ్గు, కఫం తగ్గాలంటే అల్లాన్ని ఆహారంలో చే
అల్లంతో మధుమేహాన్ని నియంత్రించవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్స్, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జలుబు, దగ్గు, కఫం తగ్గాలంటే అల్లాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఉబ్బసం వ్యాధితో బాధపడేవారు అల్లం రసంలో తేనె కలుపుకుని తాగితే ఉబ్బసం తగ్గిపోతుంది. జీర్ణక్రియ మెరుగ్గా వుంటుంది.
అల్లం వాడితే గొంతు ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. అరకప్పు వేడి నీళ్లలో చెంచా శొంఠి పొడి, అల్లం రసం, అర చెంచా నిమ్మ రసం, తేనె కలిపి పుక్కిలిస్తే గొంతు మంట, నొప్పి అదుపులోకి వస్తాయి. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది.
నోటిలో చేరిన ప్రమాదకర బాక్టీరియాను అల్లం నశింపజేస్తుంది. దంతాలను ఆరోగ్యంగా వుంచుతుంది. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా మజ్జిగలో అల్లం, కరివేపాకు కలిపి తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.