షుగర్ వ్యాధిగ్రస్తులకు హెర్బల్ జ్యూస్ లిస్ట్, ఏంటవి?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (19:36 IST)
షుగర్ వ్యాధి. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే  మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్‌లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగుతుంటే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది.
 
ఉసిరి, కలబంద రసానికి కాస్తంత తేనె, మిరియాలు జోడించి సేవిస్తుంటే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ చియా గింజలను బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగుతుంటే మధుమేహం అదుపులో వుంటుంది. వేడి నీటిలో ఏడెనిమిది తులసి ఆకులు వేసి అందులో కొద్దిగా అల్లం, నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనం వుంటుంది.
 
మధుమేహాన్ని అదుపులో పెట్టుకునేందుకు ధనియాలు నీరు కూడా దోహదం చేస్తాయి. పాలకూర, మెంతికూరతో కలిపి చేసే రసం కూడా మధుమేహానికి అడ్డుకట్ట వేయగలదు. చక్కెర వేయకుండా తయారుచేసిన టొమాటో రసం మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తం పలుచబడేందుకు సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిందూ మతం అనేది ఒక జీవన విధానం : సుప్రీంకోర్టు

ఇంధన పొదుపు .. కాన్వాయ్‌లోని వాహనాలు తగ్గించండి : చంద్రబాబు ఆదేశం

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయమంటే నన్ను పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు: బక్క జడ్సన్

రూ. 30 వేలు తీసుకున్న లంచగొండి మైనింగ్ అధికారిని పట్టుకుంటే రూ. 4 కోట్లు బయటపడ్డాయి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్‌ఫ్లవర్ రైతుల నిరసనలు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments