ఉల్లికాడల్లోని ఫైబర్, ఎ, బి, సి విటమిన్లు, ఫోలేట్‌తో పాటు పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి లవణాలు అధికంగా ఉంటాయి. వీటిలో ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము.
ఉల్లి కాడల్లోని ఎ, సి విటమిన్లు ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడటమే కాక రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ఉల్లి కాడలు శరీరానికి సూక్ష్మపోషకాలను అందించడమే కాకుండా జీవక్రియల్ని నియంత్రిస్తాయి.
మధుమేహంతో బాధపడేవారికి ఉల్లికాడలు మంచి డైట్.
ఉల్లి కాడల్లో వున్న అల్లిసిన్ అనే రసాయనం చర్మం ముడతలు పడకుండా చూస్తుంది.
ఉల్లి కాడలు ఇన్సులిన్ ఉత్పత్తి పెంచి, రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా చూస్తాయి.
కేన్సర్ కణాలను ఉత్పత్తి చేసే ఎంజైమ్‌ల విడుదలను నిలిపివేసే శక్తి ఉల్లికాడల్లో వుంది.
ఉల్లికాడల్లోని కె,సి విటమిన్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఉల్లి కాడల్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు సాధారణంగా వచ్చే జలుబు, దగ్గును నివారిస్తాయి.