Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధుమేహం కంట్రోల్ చేయగల ఆహార పదార్థాలు, ఏంటవి?

మధుమేహం కంట్రోల్ చేయగల ఆహార పదార్థాలు, ఏంటవి?
, శనివారం, 8 ఏప్రియల్ 2023 (23:54 IST)
మధుమేహం. జీవనశైలిలో వచ్చిన మార్పులు కారణంగా మధుమేహం తలెత్తుతుంది. దీన్ని అదుపు చేసేందుకు తగు పదార్థాలను తీసుకోవాలి. ఈ చిన్ని జాగ్రత్తలతో మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల మరొకటి మెంతులు, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
 
మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. రోజూ వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
 
మధుమేహాన్ని కలబంద అడ్డుకుంటుంది, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. షుగర్ వ్యాధిని అడ్డుకోవడంలో సాయపడే మరో చక్కని దినుసు దాల్చిన చెక్క.
టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల శక్తి కాకర కాయకు వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీతాఫలం గింజలను మేకపాలతో మెత్తగా నూరి బట్టతలకు లేపనం చేస్తే?