Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరాన్నితాకితే...

చాలామంది ఉదయాన్నే నిద్రలేవడం ఎంతో కష్టంగా భావిస్తుంటారు. రాత్రిసమయంలో ఎంత ఆలస్యంగానైనా పడుకుంటారు కానీ, ఉదయాన్నే నిద్రలేవడం మాత్రం ససేమిరా అంటారు. మరి అలాంటప్పుడు ఉత్సాహవంతమైన ఉదయానికి స్వాగతం పలకడాని

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (10:33 IST)
చాలామంది ఉదయాన్నే నిద్రలేవడం ఎంతో కష్టంగా భావిస్తుంటారు. రాత్రిసమయంలో ఎంత ఆలస్యంగానైనా పడుకుంటారు కానీ, ఉదయాన్నే నిద్రలేవడం మాత్రం ససేమిరా అంటారు. మరి అలాంటప్పుడు ఉత్సాహవంతమైన ఉదయానికి స్వాగతం పలకడానికి ఏం చేయాలి.
 
నిజానికి సూర్యోదయం కంటే ముందు నిద్రలేవడం వల్ల ఆ రోజంతా ఎంతో హుషారుగా ఉంటారు. కానీ, అలా నిద్రలేవడమే చాలా కష్టంగా భావిస్తుంటారు. నిద్ర నుండి బయటపడలేక, ఆ బద్దకాన్ని వదల్లేక ఇబ్బందులు పడుతుంటారు.
 
అలాగే, ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరంపై పడటం వల్ల నిద్ర మత్తు వదిలిపోతుంది. పైగా, శరీరం నూతనోత్సాహాన్ని పొందుతుంది. అంతేకాదు శరీరానికి సహజసిద్ధమైన శక్తి అందుతుంది. 
 
నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత జాగింగ్‌, వాకింగ్‌లాంటివి చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. నిద్రలేవగానే గ్లాసు మంచినీళ్ళు తాగాలి. దీనివల్ల డీహైడ్రేషన్‌ కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
 
రాత్రిపూట టీవీ ఎక్కువసేపు చూడటం వల్ల రాత్రంతా నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. పడుకునేముందు టీవీ చూడటం వల్ల ఆ వెలుతురు కళ్ళపై ప్రభావం చూపుతుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments