Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే.. చర్మవ్యాధులు తగ్గుతాయట..

పశుపక్ష్యాదులు తెల్లవారుజామునే కిలకిలారావాలతో సూర్యదేవునికి స్వాగతం పలుకుతూ మానవాళిని మేల్కొలుపుతాయి. కానీ మానవులు మాత్రం మొద్దునిద్రలోనే జోగుతూవుంటారు. తెల్లవారుజామున లేవకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు

సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే.. చర్మవ్యాధులు తగ్గుతాయట..
, బుధవారం, 8 నవంబరు 2017 (12:22 IST)
పశుపక్ష్యాదులు తెల్లవారుజామునే కిలకిలారావాలతో సూర్యదేవునికి స్వాగతం పలుకుతూ మానవాళిని మేల్కొలుపుతాయి. కానీ మానవులు మాత్రం మొద్దునిద్రలోనే జోగుతూవుంటారు. తెల్లవారుజామున లేవకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవు. పగటిపూట శ్రమించిన మానవుడు రాత్రి నిద్రించడంవల్ల అతని అవయవాలన్నీ విశ్రాంతి పొందుతాయి. 
 
దాంతోపాటు రాత్రి సమయం చల్లగా వుండటంవల్ల తాను పీల్చుకునే శ్వాసకూడా చల్లగా ప్రశాంతంగా జరుగుతుంటుంది. అలాంటి ప్రశాంత వాతావరణం సూర్యోదయంతో ఛేదించబడుతుంది. భూమి వేడెక్కుతుంది. దానివల్ల మానవుడు పీల్చుకుని వదిలే శ్వాసకూడా వేడెక్కుతుంది. 
 
ఆ సమయానికి మనిషి నిద్రలేచి తన పనులకు ఉపక్రమిస్తే శరీరంలో ఘర్షణ మొదలై అదికూడా వేడెక్కి శ్వాసతో లీనంకావడంవల్ల వ్యాధులను నిరోధించే సహజశక్తి ఎల్లప్పడూ సంపూర్ణంగా ఉత్పన్నమౌతుంటుంది. అలాకాకుండా మనిషి సూర్యోదయం తర్వాత కూడా నిద్రించడంవల్ల అతని శ్వాసమాత్రం సూర్యప్రభావంతో వేడెక్కి అతని శరీరం చల్లగావుండి ఈ రెండు విరుద్ధమై దాని ఫలితంగా శరీరంలో క్రమంగా వ్యాధినిరోధకశక్తి క్షీణిస్తుంది. తద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరపా నిద్రపోవడం, సూర్యోదయానికి ముందే నిద్రలేచే వారికి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. అందువల్లే వాకింగ్ చేయాలి. తద్వారా శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఈ విటమిన్ ఎముకల పటుత్వాని సహాయపడుతుంది. అంతేగాకుండా ఈ సూర్య కిరణాల కారణంగా అనేక చర్మ వ్యాధులు తగ్గుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపవాసంతో ఆయువు పెరుగుతుంది... తెలుసా?