Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిద్రలేచేటప్పుడు కుడివైపుకు దొర్లి లేవాలి.. సద్గురు

నిద్రలేచేటప్పుడు కుడివైపుకు దొర్లి లేవాలి. నిద్రలేచినప్పుడు ఒక్కసారిగా క్రియాకలాపం పెరుగుతుంది. అందుచేత కుడివైపుకు దొర్లి లేవాలి. ఎందుకంటే జీవక్రియాకలాపం తక్కువగా ఉన్నప్పుడు మీరు అకస్మాత్తుగా ఎడమకు మర

Advertiesment
నిద్రలేచేటప్పుడు కుడివైపుకు దొర్లి లేవాలి.. సద్గురు
, శుక్రవారం, 18 ఆగస్టు 2017 (12:59 IST)
నిద్రలేచేటప్పుడు కుడివైపుకు దొర్లి లేవాలి. నిద్రలేచినప్పుడు ఒక్కసారిగా క్రియాకలాపం పెరుగుతుంది. అందుచేత కుడివైపుకు దొర్లి లేవాలి. ఎందుకంటే జీవక్రియాకలాపం తక్కువగా ఉన్నప్పుడు మీరు అకస్మాత్తుగా ఎడమకు మర్లితే మీ హృదయవ్యవస్థ మీద ఒత్తిడి పడుతుంది. శరీరంలో గుండె ప్రధాన అవయవం. గుండె లేకపోతే.. శరీరానికి రక్తాన్ని ప్రసారం చేసే పని ఆగిపోతుంది. 
 
శరీరంలోని అన్ని ప్రదేశాలకూ గుండె రక్తాన్ని ప్రసారం చేస్తుంది. ఈ ప్రక్రియ జరగకపోతే.. ఏమీ జరగదు. ఈ రక్తం పంపింగు చేసే స్థానం శరీరంలో ఎడమ పక్కన ఉంటుంది. అందుకే పడకమీది నుండి లేచేటప్పుడు కుడి వైపుకు దొర్లి లేవాలి. మీ శరీరం ఒక విధమైన విశ్రాంత భంగిమలో, స్థితిలో ఉన్నప్పుడు జీవక్రియకు అవసరమైన క్రియాకలాపం తక్కువగా ఉంటుంది. లేచినప్పుడు క్రియాకలాపం పెరుగుతుంది. అందుకే కుడివైపు దొర్లి లేవాలి. ఇలా చేయడం ద్వారా హృదయ వ్యవస్థకు మేలు జరుగుతుంది. 
 
ఉదయం మేల్కొన్నప్పుడు చేతుల్ని రుద్దుకుని, మన అరచేతుల్ని కన్నులమీద ఆన్చుకొవాలని కూడా వినివుంటాం. ఇందులో ఆధ్యాత్మికం ప్లస్ ఆరోగ్యం కూడా వుంది. చేతుల్లో నరాల కొనలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. అరచేతుల్ని ఒకదానితో ఒకటి రుద్దినట్లయితే నరాల కొనలు క్రియాశీలమై ఆ వ్యవస్థ తక్షణమే మేల్కొంటుంది.
 
ఉదయం మత్తుగా, నిద్ర వదలని స్థితిలో ఉంటే అరచేతుల్ని ఒకదానితో ఒకటి రుద్దితే శరీరం మొత్తం మేల్కొంటుంది. తక్షణమే కన్నులకు.. మిగిలిన ఇంద్రియాలకు అనుసంధింపబడిన నరాలన్నీ మేల్కొంటాయి. శరీరాన్ని కదిలించడానికి ముందే మెదడు మేలుకుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : మీ రాశి ఫలితాలు 18-08-17