Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నబడాలనుకుంటే.. బ్రౌన్‌బ్రెడ్ శాండ్‌విచ్ తీసుకోండి..

సన్నబడాలనుకునేవారు తినే పదార్థాల్లో కొవ్వు లేకుండా చూసుకోవాలి. మొలకలూ, పండ్లూ, డ్రైఫ్రూట్స్‌, బ్రౌన్‌బ్రెడ్‌ శాండ్‌విచ్‌ వంటివి ఎంచుకోవడం మంచిది. ఆఫీసుల్లో గంటలపాటు కూర్చుని పనిచేసేవారు తరచూ వీటిని డ

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (15:14 IST)
సన్నబడాలనుకునేవారు తినే పదార్థాల్లో కొవ్వు లేకుండా చూసుకోవాలి. మొలకలూ, పండ్లూ, డ్రైఫ్రూట్స్‌, బ్రౌన్‌బ్రెడ్‌ శాండ్‌విచ్‌ వంటివి ఎంచుకోవడం మంచిది. ఆఫీసుల్లో గంటలపాటు కూర్చుని పనిచేసేవారు తరచూ వీటిని డైట్‌లో చేర్చుకోవాలి. అలాగే మేలుచేసే కొవ్వు పదార్థాలను ఎంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే బాదం, వాల్‌నట్లూ, పిస్తా వంటి డ్రైఫ్రూట్లూ, రైస్‌బ్రాన్‌ నూనె వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.
 
పొద్దున్నే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. అందులోనూ మాంసకృత్తులూ, పీచూ, సంక్లిష్ట పిండిపదార్థాలున్నవి ఎంచుకుంటే మంచిది. మధ్యాహ్నం భోజనం తక్కువ తీసుకున్నవారవుతారు. గుడ్లూ, పప్పుధాన్యాలూ, అవిసెగింజలు, చేపలు వంటివాటితో పాటు కూరగాయలూ, ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి. 
 
బరువు పెరిగేందుకు పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారడమే. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులూ, కొర్రలూ, జొన్నల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి జతగా కూరగాయలూ, ఆకుకూరల్ని ఎంచుకుంటే పోషకాలు అందుతాయి. శరీర జీవక్రియా రేటు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments