కొంతవరకు కొవ్వు అవసరమే... లేకుంటే నెలసరి సమస్యలు తప్పవట..
బరువు తగ్గాలనుకునే మహిళలు తీసుకునే ఆహారాల్లో కొవ్వే ఉండకూడదనుకుంటారు. అయితే శరీర వ్యవస్థలూ, హార్మోన్లు సరిగ్గా పనిచేయాలంటే.. డైటరీ ఫ్యాట్ కూడా కొంతవరకూ అవసరమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లేకుంటే నె
బరువు తగ్గాలనుకునే మహిళలు తీసుకునే ఆహారాల్లో కొవ్వే ఉండకూడదనుకుంటారు. అయితే శరీర వ్యవస్థలూ, హార్మోన్లు సరిగ్గా పనిచేయాలంటే.. డైటరీ ఫ్యాట్ కూడా కొంతవరకూ అవసరమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లేకుంటే నెలసరికి సంబంధించిన సమస్యలు ఎదురుకావచ్చునని గైనకాలజిస్టులు అంటున్నారు. అందుకే ఆరోగ్యానికి మేలుచేసే కొవ్వు పదార్థాలను ఎంచుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇందు కోసం పిస్తా, డ్రైఫ్రూట్స్, రైస్ బ్రాన్ నూనెలు, బాదం వంటివి ఎంచుకోవాలి.
అలాగే శరీరానికి తగిన శక్తి లభించాలంటే.. పొద్దున్నే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. వాటిలో మాంసకృత్తులూ, పీచూ, సంక్లిష్ట పిండిపదార్థాలున్నవి ఎంచుకుంటే మంచిది. మధ్యాహ్నం భోజనం తక్కువుగా తీసుకున్నవారు.. గుడ్లూ, పప్పుధాన్యాలూ, అవిసెగింజలు, చేపలు వంటివాటితో పాటు కూరగాయలూ, ఆకుకూరలు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. ఇలా శరీరానికి అవసరమైన ఫ్యాట్ తీసుకుంటూ.. ముతక బియ్యం, రాగులూ, జొన్నలు వంటివి తీసుకుంటే బరువు పెరగరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.