కేన్సర్ రోగులకూ స్టార్ హెల్త్ బీమా పాలసీ

దేశంలో ఉన్న ప్రైవేటు వైద్య బీమా కంపెనీల్లో ఒకటి స్టార్ ఆరోగ్య బీమా కంపెనీ (స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్య బీమా చరిత్రలోనే కేన్సర్ రోగులకు కూడా బీమా పాలసీని

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (12:24 IST)
దేశంలో ఉన్న ప్రైవేటు వైద్య బీమా కంపెనీల్లో ఒకటి స్టార్ ఆరోగ్య బీమా కంపెనీ (స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్య బీమా చరిత్రలోనే కేన్సర్ రోగులకు కూడా బీమా పాలసీని ప్రవేశపెట్టింది. అదీ కూడా కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయిన తర్వాత ఈ పాలసీని తీసుకోవచ్చు. స్టార్ కేన్సర్ కేర్ గోల్డ్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ బీమా పాలసీ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం చెన్నైలో జరిగింది. ఈ పాలసీని పద్మ విభూషణ్ గ్రహీత డాక్టర్ వి. శాంతా చేతుల మీదుగా ప్రారంభమైంది.
 
ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వి.జగన్నాథన్ మాట్లాడుతూ, 5 నెలల నుంచి 65 యేళ్ళ లోపు కేన్సర్ రోగులు రూ.3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల విలువ చేసే బీమా పాలసీని తీసుకోవచ్చన్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకునే కేన్సర్ రోగుల కోసం ఈ తరహా బీమా పాలసీని తొలిసారి తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ పాలసీని తీసుకోదలచిన వారు ముందుగా ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన పని లేదన్నారు. అయితే, తమకు కేన్సర్ సోకినట్టు నిర్ధారించే కేన్సర్ నిర్ధారణ కేంద్రాల నుంచి ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందన్నారు. 
 
కేన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2తో బాధపడేవారు రూ.5 లక్షల వరకు వైద్య బీమా పాలసీని పొందవచ్చన్నారు. తాము ప్రవేశపెట్టిన ఈ కొత్త పాలసీ వల్ల కేన్సర్ వ్యాధితో బాధపడేవారు, రెండోసారి కేన్సర్ వ్యాధి బారినపడినవారు, కేన్సర్ లక్షణాలు కలిగినవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కేన్సర్ బారినపడిన వారు కాకుండా ఇతర వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారుకూడా ఈ పాలసీని పొంది, రెండు రకాల లబ్ధి పొందవచ్చన్నారు. ఇదే దీని ప్రత్యేక అని చెప్పారు. 
 
ముఖ్యంగా, ఎలాంటి ముందస్తు వైద్య పరీక్షలు లేకుండా ఈ పాలసీని తీసుకోవచ్చన్నారు. అంతేకాకుండా, కేన్సర్ వ్యాధి ఉన్నట్టు వివిధ రకాల పరీక్షల ద్వారా నిర్ధారణ అయితే చికిత్స కోసం బీమా పాలసీ మొత్తంలో సగం సొమ్మును ముందుగానే అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్, స్టార్ హెల్త్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments