Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోంపు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

సోంపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సోంపును నమలడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. వంద గ్రాముల సోంపులో 39 గ్రాముల ఆహార సంబంధిత పీచు ఉంటుంది. దీనివల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బాలింతలకు సోంపును వేడినీటిలో మ

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (20:34 IST)
సోంపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సోంపును నమలడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. వంద గ్రాముల సోంపులో 39 గ్రాముల ఆహార సంబంధిత పీచు ఉంటుంది. దీనివల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బాలింతలకు సోంపును వేడినీటిలో మరిగించి ఇస్తే ఆ నీటిని తాగడం వల్ల బిడ్డకు పాలు బాగా అందుతాయి. దగ్గు వదలకుండా వేధిస్తున్నప్పుడు ఒక చెంచాడు సోంపును నమలడం వల్ల దగ్గునుండి ఉపశమనాన్ని పొందవచ్చు. 
 
కీళ్ల నొప్పులు ఉన్నవారు సోంపు నూనెతో మర్దన చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. సోంపులో ఇనుము, రాగి, జింక్‌, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎర్రరక్తకణాలు ఏర్పడడానికి తోడ్పడతాయి. జింకు పాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల అది మన శరీరంలోని ఎంజైముల పనితీరును మెరుగుపరచి, జీవక్రియలు సక్రమంగా సాగేలా చూస్తుంది. 
 
సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ చర్యలను నిరోధిస్తాయి. దీని ఫలితంగా ఇన్‌ఫెక్షన్లు దూరం కావడంతోబాటు మన ముఖంలో వృద్దాప్యానికి సంబంధించిన ఛాయలను కూడా దూరంగా ఉంచుతుందట.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments