Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చకర్పూరం... శృంగార సామర్థ్యం... ఎలాగంటే?

పచ్చ కర్పూరం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏవిధంగా ఉపయోగపడతాయో చూద్దాం. 1. చిటికెడు బెల్లం చిటికెడు పచ్చకర్పూరం కలిపి తీసుకున్నట్లయితే ఉబ్బసం వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుంది. 2. ఈ పచ్చకర్పూరం రెండు పలుకులు తీసుకుని కాస్త గంధం కాని, కాస

Webdunia
శనివారం, 10 ఫిబ్రవరి 2018 (20:04 IST)
పచ్చ కర్పూరం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏవిధంగా ఉపయోగపడతాయో చూద్దాం.   
 
1. చిటికెడు బెల్లం చిటికెడు పచ్చకర్పూరం కలిపి తీసుకున్నట్లయితే ఉబ్బసం వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుంది.
 
2. ఈ పచ్చకర్పూరం రెండు పలుకులు తీసుకుని కాస్త గంధం కాని, కాస్త వెన్నను కాని కలిపి తమలపాకులో పెట్టి నమిలి రసం మింగినట్లయితే ఒంట్లో ఉన్న వేడి మొత్తం వెంటనే తగ్గిపోతుంది. తలతిరగడం, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమటలు పట్టడం ఇలాంటివి ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతాయి.
 
3. మహిళల్లో మర్మావయవాల దురద తగ్గాలి అంటే పచ్చ కర్పూరాన్ని రోజ్ వాటర్‌లో కలిపి మెత్తగా నూరాలి. దీనిలో దూదిని ముంచి దురద ఉన్న చోట 15 నిమిషాలు ఉంచి ఆ తరువాత కడిగివేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
4. శృంగార కోరికలు పెంచుకోవడానికి చాలామంది వయాగ్రా టాబ్లెట్స్ వాడుతుంటారు. కాని వీటిని వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పచ్చకర్పూరంతో సహజసిద్ధమైన వయాగ్రాని తయారుచేసుకోవచ్చు. 
 
5. సహజసిద్ధంగా ఎలా తయారుచేసుకోవచ్చంటే.. పచ్చకర్పూరం-5 గ్రాములు, జాజికాయ-5 గ్రాములు, జాపత్రి- 5గ్రాములు, ఎండుద్రాక్ష- 5గ్రాములు. వీటన్నిటిని తీసుకుని వీటిని బాగా నూరి చిన్నచిన్న గింజలుగా చేయాలి. అంటే బఠాణి గింజంత మాత్రలుగా చేయాలి. వీటిని రోజూ పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని ఒక గ్లాసు పాలు తాగడం వల్ల వీర్యవృద్ధి చెందడమే కాక లైంగిక సామర్ద్యం కూడా మెరుగవుతుంది.
 
6. నిత్యం వెల్లుల్లి వాడటం వల్ల శృంగారాన్ని పెంపొందించి వీర్యాన్ని వృద్ధి చేస్తుందని ఈమధ్య జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా శృంగారం పట్ల ఆసక్తిని పెంచే గుణం కూడా వెల్లుల్లికి ఉందని నిరూపించబడింది. రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి దానిలో కొంచెం తేనె కలిపి తీసుకుంటే పురుషాంగానికి కావల్సిన రక్తసరఫరా జరిగి శృంగార శక్తిని పెంచుతుంది మరియు వీర్యవృద్ధిని కలిగిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం