Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోంగూర పూలను దంచి... అరకప్పు రసం చేసి.. అలా తీసుకుంటే...

ప్రకృతిలో ప్రతి ఆకు ఒక మూలిక. సృష్టిలోని ప్రతి మొక్క ఎంతోకొంత ఔషధ గుణం కలిగి ఉంటుంది. కాకపోతే మన శాస్త్రజ్ఞులు ఇప్పటికి కొన్ని గుణాలను మాత్రమే తెలుసుకోగలిగారు.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (14:03 IST)
ప్రకృతిలో ప్రతి ఆకు ఒక మూలిక. సృష్టిలోని ప్రతి మొక్క ఎంతోకొంత ఔషధ గుణం కలిగి  ఉంటుంది. కాకపోతే మన శాస్త్రజ్ఞులు ఇప్పటికి కొన్ని గుణాలను మాత్రమే తెలుసుకోగలిగారు. గోంగూర అంటే ఇష్టపడనివారుండరు. దీనికి ఆంధ్రామాత అని పేరు కూడా ఉంది. గోగుపూలు అందంగా ఉంటాయి.  అస్తమించే సూర్యుడు గోగుపూల ఛాయలో ఉంటాడని కవులు వర్ణించారు కూడా.
 
గోంగూరకు ఔషధ గుణాలున్నా యని పరిశోధకులు ఎప్పుడో తెలుసుకున్నారు. వ్రణాలు, గడ్డలపైన గోంగూర ఆకును ఆముదంలో ముంచి, వెచ్చచేసి వేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. అంతేకాకుండా వ్రణాలు, గడ్డల వల్ల కలిగే తీపు తగ్గి, అవి తొందరగా పగులుతాయి. స్వస్థత చిక్కుతుంది. దీనివలన కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
 
1. రేచీకటికి రాత్రిపూట సరిగా చూపు కనపడక పోవటం అనే నేత్ర రోగం లేదా దృష్టిదోషంతో బాధపడేవారు భోజనంలో ఆకుకూరగానో, పచ్చడిగానో, ఊరగాయగానో గోంగూర వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. గోంగూర పూలను దంచి, అరకప్పు రసం చేసి, దాన్ని వడకట్టి, దానిలో ఒక అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
 
2. తరచూ గోంగూర వాడుతూ గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది.
 
3. బోదకాలు తగ్గడానికి శరీరంలో వాపులు తీయడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి ఆ పదార్థాన్ని పట్టించాలి.
 
4. విరోచనాలు అధికంగా అవుతుంటే కొండగోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి త్రాగితే అవి కట్టుకుంటాయి. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూర అన్నంతో తిన్నా విరోచనాలు తగ్గిపోతాయి.
 
5. దగ్గు, ఆయాసం తుమ్ములతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఏదోవిధంగా... అంటే ఆహారంగానో లేక ఔషధంగానో పుచ్చుకుంటే స్వస్థత చిక్కుతుంది.
 
6. శరీరంలో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాల మంచిది. అంతేకాకుండా గోంగూర - మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది. ఉష్ణతత్వ శరీరులకు, నిక్కాకతో బాధపడేవారికి గోంగూర పడదు. వారు ఏ రూపాన కూడా గోంగూర తినరాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

తర్వాతి కథనం
Show comments