దాల్చిన చెక్కని నిమ్మరసంతో నూరి ఆ రసాన్ని తీసుకుంటే?

దాల్చిన చెక్కని ఆహారపదార్ధాల, వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. అనేక రోగాలను నిర్మూలిస్తుం

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (15:50 IST)
దాల్చిన చెక్కని ఆహారపదార్ధాల, వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. అనేక రోగాలను నిర్మూలిస్తుంది. దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో చూద్దాం.
 
1. ఒక గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబూ, దగ్గు తగ్గుతాయి.
 
2. ఒక భాగం దాల్చిన చెక్క చూర్ణానికి మూడు భాగాలు తేనె కలిపి, రాత్రి పట్టించి ఉదయం గోరువెచ్చని నీటితో కడుగుతుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. దాల్చిన చెక్కని నిమ్మరసంతో నూరి తీసిన గంధాన్ని పట్టిస్తుంటే నల్లమచ్చలు తగ్గిపోతాయి.
 
3. దాల్చిన చెక్క, శొంఠి, ఏలుకలు, సైంధవ లవణ చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని రోజూ రెండుసార్లు ఆహారం తరువాత అర గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి తాగుతుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
 
4. పావుకప్పు ఆలివ్ నూనెను వేడి చేసి మూడు స్పూన్ల తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. వారానికి ఒకటి రెండుసార్లు ఈ విధంగా చేయాలి.
 
5. దాల్చిన చెక్క, పసుపు, పొడపత్రి, నల్లజీలకర్ర చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని ఉదయం, సాయంత్రం అరచెంచా పొడిని పావుగ్లాసు నీరు లేదా పాలల్లో కలిపి తాగడం వల్ల మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments