Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లం-బెల్లం కలిపి నూరి రోజూ రెండుసార్లు తీసుకుంటే...?

అన్ని కాలాల్లో అందరి ప్రజలకూ అందుబాటులో ఉండి నిత్యం వంటకాల్లో ఉపయోగపడుతూ, సాధారణంగా మనం ఎదుర్కొనే పలు రుగ్మతల నుండి కాపాడే ఔషధం అల్లం. ఈ అల్లంలో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటంటే... 1. గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయను పిండి దాని రసం, రెండు స్ప

Advertiesment
అల్లం-బెల్లం కలిపి నూరి రోజూ రెండుసార్లు తీసుకుంటే...?
, శుక్రవారం, 23 మార్చి 2018 (21:28 IST)
అన్ని కాలాల్లో అందరి ప్రజలకూ అందుబాటులో ఉండి నిత్యం వంటకాల్లో ఉపయోగపడుతూ, సాధారణంగా మనం ఎదుర్కొనే పలు రుగ్మతల నుండి కాపాడే ఔషధం అల్లం. ఈ అల్లంలో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటంటే...
 
1. గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయను పిండి దాని రసం, రెండు స్పూన్ల అల్లం రసం, రెండు స్పూన్ల తేనె, రెండు స్పూన్ల ధనియాల రసం కలిపి ఉదయం పూట తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా గుండె దడ, తల తిప్పడం, తలనొప్పి, అలసట తగ్గుతాయి.
 
2. రెండు స్పూన్ల అల్లం రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం తాగుతుంటే శరీరంపై వచ్చే దద్దుర్లు, తరచుగా జలుబు, తుమ్ములు రావడం, దగ్గు, ఆయాసం నెమ్మదిస్తాయి. పులి తేన్పులు తగ్గి జీర్ణశక్తి మెరుగవుతుంది.
 
3. అల్లం, బెల్లం సమానంగా కలిపి నూరి రోజూ రెండు మూడుసార్లు తీసుకుంటే అరికాళ్లు, చేతుల్లో పొట్టు ఊడటం తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్దకం లేకుండా సుఖ విరేచనం అవుతుంది.
 
4. ఒక స్పూన్ అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం తరచుగా, అప్రయత్నంగా వీర్యం పోవడం తగ్గి శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
 
5. తులసి ఆకులు, పసుపు, అల్లం రసంతో నూరి దద్దుర్లు, దురద, మచ్చలు, మొటిమలు మొదలైనవాటిపై రాస్తుంటే అవి త్వరగా తగ్గుతాయి.
 
6. ఆముదంలో అల్లపు రసం కలిపి చర్మానికి పూస్తే వివిధ చర్మ వ్యాధులు తగ్గుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారం కంటే అందమైనది శృంగారం... స్త్రీపురుషులు అప్పుడెలా?