Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేయించిన వేరుశనగపప్పుని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే...?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (21:31 IST)
శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్‌, ఫాస్ఫరస్‌, థైమీన్‌, నియాసిన్‌ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుశెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. ఎ, బి, సి, ఇ విటమిన్లతో కలిపి మొత్తం 13 రకాల విటమిన్లూ ఐరన్‌, కాల్షియం, జింక్‌, బోరాన్‌... వంటి 26 రకాల కీలక ఖనిజాలూ వీటిల్లో ఉన్నాయి. వేరుశనగపప్పులోని ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.
 
1. పల్లీల్లో గుండెకు మేలు చేసే కొవ్వుల శాతమే ఎక్కువ. ఇందులోని ప్రోటీన్‌ శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. 
 
2. పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజా గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. హెపటైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ వంటివి రాకుండా ఉంటాయి. 
 
3. హీవోఫీలియాతో బాధపడేవాళ్లకి ఇవి ఎంతో మంచివి. ముక్కునుంచి రక్తం కారుతుంటే కాసిని వేరుసెనగపప్పు తింటే తగ్గుతుందట. అలాగే నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలు కొంచెం పల్లీలు నానబెట్టి బెల్లంతో కలిపి తింటే ఐరన్‌తో పాటు అన్ని రకాల పోషకాలూ అందుతాయి.
 
4. యాంటీ ఆక్సిడెంట్లకు ఇవి మంచి నిల్వలు. వేయించిన పల్లీల్లో అయితే వీటి శాతం బ్లాక్‌బెర్రీ, స్ట్రాబెర్రీల్లోకన్నా ఎక్కువ. క్యారెట్లు, బీట్‌రూట్‌లతో పోలిస్తే ఇంకా ఎక్కువని ఇటీవల పరిశోధనల్లో తేలింది.
 
5. వీటిల్లోని రిజవెరాట్రాల్‌ అనే రసాయనం హృద్రోగాల నుంచీ, క్యాన్సర్ల బారి నుంచీ రక్షిస్తుంది. వృద్ధాప్యం దరిచేరకుండా నిత్యయవ్వనంతో ఉండేలా చేస్తుంది.
 
6. నియాసిన్‌ లోపం కారణంగా వచ్చే దీర్ఘకాలిక డయేరియా బాధితులకీ వేరుసెనగ మంచిదేనట. మేక పాలలో కాస్త నిమ్మరసం పిండి తాగి ఓ గుప్పెడు వేయించిన పల్లీలు తింటే ఈ వ్యాధి తగ్గుతుందట. 
 
7. తాజా పచ్చి పల్లీలకు చిటికెడు ఉప్పు రాసి తింటే చిగుళ్లు గట్టిబడి దంతాల్ని సంరక్షిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

తర్వాతి కథనం
Show comments