Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే?

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (22:19 IST)
చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కుకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో పలు రకాల ఔషదాలు, పోషకాలు దాగి ఉన్నాయి. ఇందులో మన శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
 
1. కరివేపాకులో కొవ్వు తగ్గించే గొప్ప గుణం ఉంది. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను పొడిని తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ కూడా గణనీయంగా తగ్గుతుంది.
 
2. గర్బిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
 
3. ప్రతిరోజు పది ముదురు కరివేపాకు ఆకులను నమిలి మింగాలి. ఇలా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేయడం వలన మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది.
 
4. పుల్లని పెరుగులో కొద్దిగా నీరు చేర్చి అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలోని అధిక వేడి తగ్గుతుంది.
 
5. కాలిన లేదా కమిలిన గాయాలకు కరివేపాకు గుజ్జు రాయడం వలన నొప్పి, గాయం త్వరగా తగ్గుతాయి.
 
6. కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

తర్వాతి కథనం
Show comments