Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిమ్మరసం, పాలు సమంగా కలిపి అక్కడ మృదువుగా మర్దన చేస్తే...

నిమ్మరసం, పాలు సమంగా కలిపి అక్కడ మృదువుగా మర్దన చేస్తే...
, బుధవారం, 8 మే 2019 (22:20 IST)
కొందరిలో ముఖంపై మంగుమచ్చలు వచ్చి ముఖం అందవికారంగా ఉండడం వలన మానసిక వేదనను అనుభవిస్తుంటారు. అవి ప్రమాదకరమైనవి కాదు, ఒకరి నుండి మరొకరికి వ్యాపించవు. జన్యు సంబంధ కారాణాల వల్ల, సూర్యరశ్మి ప్రభావం వల్ల మరియు హార్మోన్ల ప్రభావం వల్ల ఈ మంగు మచ్చలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మనం వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే సరి.
 
1. నిమ్మరసం, పాలు సమంగా కలిపి మచ్చలపై మృదువుగా మర్దనా చేయాలి. అలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
 
2.గులాబీ పూల పొడిలో తగినంత నిమ్మరసం చేర్చి పట్టిస్తూ ఉన్నట్లయితే క్రమంగా మచ్చలు పోతాయి.
 
3.ఉసిరిక పెచ్చుల పొడి, పసుపు సమానంగా కలిపి సేవిస్తున్నా మంగు మచ్చలు తగ్గుముఖం పడతాయి.
 
4. రాత్రిపూట 50 మి.లీ నీటిలో ఒక గ్రాము వేప బెరడు పొడి వేసి ఉదయాన్నే వడకట్టి 5 మి.లీ తేనె కలుపుకుని తాగినట్లయితే మంగు మచ్చలకు మంచి ఔషధంలా పని చేస్తుంది.
 
5. ఒక భాగం శ్రీ గంధం పొడిలో దానికి రెట్టింపు బొప్పాయి గుజ్జుని చేర్చి బాగా కలిపి మంగు మచ్చలు ఉన్న చోట రాయాలి. ఇలా చేయడం వలన మంగు మచ్చలు తగ్గుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మండే వేసవి... చల్లని కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుంది?