Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెంతిపిండి, పెరుగుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

Advertiesment
మెంతిపిండి, పెరుగుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?
, మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (10:51 IST)
ఇప్పటి వేసవి కాలంలో ఎండ వేడిమి రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ ప్రభావంతో చర్మం, జుట్టు పాడవుతాయి. అలాకాకుండా ఉండాలంటే.. బయటదొరికే పదార్థాలు వాడడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో కొన్ని చిట్కాలు పాటిస్తే వీటన్నింటి నుండి విముక్తి లభిస్తుంది. మరి అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
 
ఈ కాలంలో ఎంత శుభ్రంగా ఉన్నా కూడా చర్మంపై జిడ్డు పేరుకుని మొటిమలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. పావుస్పూన్ మెంతుల్ని ఓ గిన్నెలో నీళ్లుపోసి మరిగించుకోవాలి. ఈ నీరు బాగా చల్లారిన తరువాత గింజలని తీసి ఆ నీటితో ముఖానికి రాసుకోవాలి. ఇలా తరచు చేస్తుంటే మెంతిలోని యాంటీసెప్టిక్ గుణాలు సమస్యను తగ్గిస్తాయి. 
 
మెంతులు దుమ్ము, ధూళి, మృతకణాలను తొలగించి చర్మరంధ్రాలని తెరుచుకునేట్టు చేస్తాయి. ఇందుకోసం స్పూన్ మెంతిపిండిని పుల్లని పెరుగులో కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత ముఖాన్ని ఓ 5 నిమిషాలపాటు మర్దన చేసుకుని తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తుంటే ఎండ ప్రభావానికి కమిలిన చర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.
 
గుప్పెడు మెంతులు రాత్రంతా నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం, ఆలివ్ నూనె, పెరుగు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఓ గంటపాటు అలానే ఉండాలి. ఇలా చసే్తే మాడుకు చల్లదనం అందుతుంది. అలానే నిర్జీవంగా మారిన జుట్టు నిగారింపుతో కనిపిస్తుంది. ఎండలో తిరిగి తిరిగి చర్మం నల్లగా మారితే.. పాలలో కొద్దిగా మెంతిపొడిని కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. ప్యాక్ బాగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బరినూనెను నోట్లో వేసుకుని.. ఇలా చేస్తే..?