Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మకాయతో 5 అమూల్యమైన ఉపయోగాలు... ఏమిటో తెలుసా?

నిమ్మకాయలు మనకు ఏ కాలంలోనైనా దొరుకుతాయి. అయితే ఇవి వేసవికాలంలో అధికంగా వస్తాయి. వీటి వాడకం ఈ కాలంలోనే ఎక్కువగా ఉంటుంది. ఆహార పదార్ధాల్లో నిమ్మకాయను వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ నిమ్మకాయ వల్ల మనకు కలిగే ఆరోగ్య

Webdunia
బుధవారం, 2 మే 2018 (20:56 IST)
నిమ్మకాయలు మనకు ఏ కాలంలోనైనా దొరుకుతాయి. అయితే ఇవి వేసవికాలంలో అధికంగా వస్తాయి. వీటి వాడకం ఈ కాలంలోనే ఎక్కువగా ఉంటుంది. ఆహార పదార్ధాల్లో నిమ్మకాయను వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ నిమ్మకాయ వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
 
1. ప్రతిరోజు పరగడుపున ఒక నిమ్మకాయ రసం గ్లాసుడు నీళ్లలో కలుపుకుని కొంచెం తేనె వేసుకుని తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. రోజంతా ఉత్సాహంగా చలాకీగా ఉంటుంది.
 
2. నిమ్మకాయ వల్ల నోటి అరుచి, పైత్యం తగ్గుతాయి. ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది. పల్చగా చేసిన మజ్జిగలో కొంచెం ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తాగితే నీరసం తగ్గి హుషారుగా ఉంటుంది.
 
3. నిమ్మకాయలు అధికంగా దొరికే ఈ కాలంలో పది నిమ్మకాయలను రసం పిండి దాంట్లో 100 గ్రాముల అల్లం చిన్నచిన్న ముక్కలుగా చేసి వేయాలి. సరిపడినంత ఉప్పు, జీలకర్ర కూడా నిమ్మరసంలో కలపాలి. వాటిని మూడురోజులు ఒక సీసాలో వేసుకుని నోరు వికారంగా ఉన్నప్పుడు ఒక అల్లం ముక్క నోట్లో వేసుకుని నమలడం వల్ల వికారం తగ్గుతుంది.
 
నిమ్మకాయ వల్ల ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకున్నాము. మరి నిమ్మతొక్కలు కూడా ఔషదంగా ఉపయోగపడతాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ.... అవేంటంటే......
 
1. నిమ్మతొక్కల్ని ఎండబెట్టి మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసి ఉంచుకుని, అవసరమైనప్పుడు ఈ పొడిలో తగినన్ని పాలు కలిపి ముఖానికి పట్టించి గంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఖరీదైన బ్యూటీక్రీములకు బదులు ఈ వైద్యంతో ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
 
2. అలాగే ఇరవై అయిదు గ్రాముల నిమ్మతొక్కలపొడి, వందగ్రాముల వంట సోడా, వంద గ్రాముల ఉప్పు కలిపి నూరి నిల్వ ఉంచుకుని దంతధావన చూర్ణంగా ఉపయోగిస్తుంటే పళ్ల మీద గార తొలగిపోయి దంతాలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments