Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దంత సమస్యలను దూరం చేసేందుకు 6 చిట్కాలు

కొంత మంది దంత సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. దంతాలు ఆరోగ్యంగా ఉండటానికీ, నోరు తాజాగా అనిపించడానికి అస్తమానం మౌత్ ఫ్రెషనర్లనే వాడాల్సిన అవసరం లేదు. మనం కొన్ని రకాల ఆహారపదార్ధాలను తీసుకోవటం ద్వారా ఈ సమస్యన

Advertiesment
దంత సమస్యలను దూరం చేసేందుకు 6 చిట్కాలు
, బుధవారం, 2 మే 2018 (20:13 IST)
కొంత మంది దంత సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. దంతాలు ఆరోగ్యంగా ఉండటానికీ, నోరు తాజాగా అనిపించడానికి అస్తమానం మౌత్ ఫ్రెషనర్లనే  వాడాల్సిన అవసరం లేదు. మనం కొన్ని రకాల ఆహారపదార్ధాలను తీసుకోవటం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అవి ఏమిటంటే...
 
1. స్ట్రాబెర్రీ, అనాస: వీటిలో బ్రొమిలీన్, విటమిన్ సి పోషకాలు ఉంటాయి. ఈ పండ్లను ఎప్పుడు తిన్నా నోరు తాజాగా ఉంటుంది. 
 
2. చీజ్, పనీర్: వీటిలోని క్యాల్షియం, ఫాస్పరస్ నోటిలో లాలాజలం ఉత్పత్తి కావడానికి సహకరిస్తాయి. నోట్లో తగినంత లాలాజలం ఉన్నప్పుడు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా ఉత్పత్తి కాదు.
 
3. నీరు: ఎన్ని తిన్నా నీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే నీరు నోటిలోని యాసిడ్ ఉత్పత్తులను నియంత్రణలో ఉంచుతుంది.
 
4. యాపిల్: సాయంత్రం పూట ఆకలి వేసినప్పుడు బిస్కెట్లు తినే బదులు ఒక యాపిల్ ను తినాలి. దీనిలోని మాలిక్ యాసిడ్ పళ్లని శుభ్రం చేస్తుంది. నోరు తాజాగా ఉంటుంది.
 
5. బాదం: బాదంలో దంతాల ఆరోగ్యాన్ని కాపాడే ప్రత్యేక ప్రోటీన్లు ఉంటాయి. ఇవి పళ్లకు ఎంతో మేలు చేస్తాయి.
 
6. పెరుగు: పెరుగులోని మంచి చేసే బ్యాక్టీరియాలు నోటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంటిపిల్లలకు చెంచా యాపిల్ జ్యూస్ తాగిస్తే?