Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగజాతి అంతమైపోతుందా? ఎందుకంటే...

మేం మగాళ్లమంటూ విర్రవీగే మగజాతికి ఇదో దుర్వార్త. త్వరలోనే మగజాతి అంతరించిపోయే దిశగా సాగుతోందని యూనివర్సిటీ ఆఫ్‌ కెంట్‌ పరిశోధనలో తేలింది. పురుషుల పుట్టుకకు కీలకమైన 'వై' క్రోమోజోమ్‌ క్రమంగా కుచించుకుపో

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (15:58 IST)
మేం మగాళ్లమంటూ విర్రవీగే మగజాతికి ఇదో దుర్వార్త. త్వరలోనే మగజాతి అంతరించిపోయే దిశగా సాగుతోందని యూనివర్సిటీ ఆఫ్‌ కెంట్‌ పరిశోధనలో తేలింది. పురుషుల పుట్టుకకు కీలకమైన 'వై' క్రోమోజోమ్‌ క్రమంగా కుచించుకుపోతోందని వారి పరిశోధనలో వెల్లడైంది. 
 
సాధారణంగా ప్రతి మనిషికీ ప్రతికణంలోనూ 23 జతల (46) క్రోమోజోములుంటాయి. వాటిలో 22 జతలు ఆటోజోమ్స్‌. మిగిలిన ఒక్క జత.. ఎక్స్‌, వై క్రోమోజోములు. వీటినే సెక్స్‌ క్రోమోజోమ్స్‌ అని పిలుస్తారు. తల్లి కడుపులో ఉన్న పిండం తాలూకూ లింగాన్ని నిర్ధారించేవి ఇవే. రెండు ఎక్స్‌లు కలిస్తే ఆడపిల్ల.. ఎక్స్‌, వై క్రోమోజోములు కలిస్తే మగపిల్లాడు పుడతారు. అలాంటి 'వై' క్రోమోజోమ్‌ ఇపుడు గతంతో పోలిస్తే బాగా కుచించుకుపోతోందట. 
 
దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే... తొలినాళ్ల క్షీరదాల్లో ఎక్స్‌, వై క్రోమోజోములు ఒకే పరిమాణంలో ఉండేవి. ఎక్స్‌ క్రోమోజోములో ఉన్న అన్ని జన్యువులూ 'వై'లోనూ ఉండేవి. అయితే, 'వై' క్రోమోజోములో ఉన్న ప్రాథమిక లోపం ఏమిటంటే.. మిగతా అన్ని క్రోమోజోములూ రెండు కాపీలు ఉంటే (జతలుగా).. ఒక్క 'వై' క్రోమోజోమ్‌ మాత్రమే 'సింగిల్‌ కాపీ' ఉంటుంది. తండ్రి నుంచి కొడుక్కి వస్తుంది. సాధారణంగా తరాలు గడిచేకొద్దీ జన్యు ఉత్పరివర్తనాలు (జీన్‌ మ్యుటేషన్స్‌) జరుగుతుంటాయి.
 
అయితే, ‘వై’ క్రోమోజోముకు జెనెటిక్ రీకాంబినేషన్ సౌలభ్యం లేకపోవడంతో దానిలోని జన్యువులు తగ్గిపోతూ అది కుచించుకుపోవడం ప్రారంభించింది. ఇది ఇలాగే కొనసాగితే మరో 46 లక్షల సంవత్సరాలకు.. భూమ్మీద మగవాళ్లే లేకుండా అంతరించిపోతారని కెంట్‌ వర్సిటీ పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం