Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'లైంగికపటుత్వం' లేక తుస్‌మంటున్న ఐటీ ఉద్యోగులు!

చాలామంది యువకులు చూసేందుకు చాకుల్లా ఉంటారు. కానీ, పడక గదిలోకి వెళ్లగానే తుస్ మంటారు. ఇలాంటివారిలో ఐటీ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. పెరుగుతున్న జీవనశైలితో పాటు ఉద్యోగ ఒత్తిడి కారణం

'లైంగికపటుత్వం' లేక తుస్‌మంటున్న ఐటీ ఉద్యోగులు!
, ఆదివారం, 6 ఆగస్టు 2017 (15:33 IST)
చాలామంది యువకులు చూసేందుకు చాకుల్లా ఉంటారు. కానీ, పడక గదిలోకి వెళ్లగానే తుస్ మంటారు. ఇలాంటివారిలో ఐటీ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. పెరుగుతున్న జీవనశైలితో పాటు ఉద్యోగ ఒత్తిడి కారణంగా ఐటీ ఉద్యోగులు లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నట్టు ఈ సర్వేలో తేలింది. దీంతో, మానసికంగా మరింత కుంగిపోతున్నారు. 
 
చిన్న వయసులోనే విపరీతమైన ఒత్తిళ్లు, జీవనశైలి యువతలో లైంగిక సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఆరంకెల జీతాలతో యువత ఆర్థికంగా పటిష్టంగా ఉంటున్నా సంసారం మాత్రం బీటలు వారుతోంది. భార్యాభర్తలిద్దరూ కష్టపడుతున్నారు. కానీ, వారికి పడక సుఖం కరువవుతోంది. వెరసి, లైంగిక పటుత్వం తగ్గుతున్న వాళ్లు కొందరు అయితే, లైంగిక ఆసక్తి లేనివాళ్లు మరికొందరు.
 
ఇటీవలికాలంలో యువతీ యువకుల్లో శృంగారేచ్ఛ గణనీయంగా తగ్గుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని పలువురు సెక్సాలజిస్టులు పేర్కొన్నారు. గతంలో స్తంభన సమస్యతో వచ్చే మగవారి వయసు సగటున 40 ఏళ్లుగా ఉండేదని.. ఇప్పుడు 25 యేళ్ల నుంచి 35 ఏళ్ల లోపువారు కూడా ఆ సమస్యతో తమను సంప్రదిస్తున్నారని సెక్సాలజిస్టులు అంటున్నారు. ఒకవైపు ఆఫీసులో పని.. ఇంటికి వచ్చాక ఇంటి పని రెండింటినీ సమతుల్యం చేయలేక తీవ్ర అలసటకు గురవుతున్న మహిళల్లో కూడా లైంగికాసక్తి తగ్గుతోందని వారు చెపుతున్నారు. 
 
ఇలాంటి సమస్యను అధికంగా ఎదుర్కొంటున్న వారిలో ఐటీ ఉద్యోగులే ఉన్నారు. విపరీతమైన పోటీ, ఒకేసారి రెండు, మూడు ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి రావడం, భిన్న స్వభావాలున్న క్లయింట్లను మెప్పించాల్సి రావడం, వేళాపాళా లేకుండా పని చేయడం, గంటలు, రోజుల తరబడి ఆఫీసులోనే అతుక్కుపోవడం వంటి సమస్యల కారణంగా శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడమే కాకుండా ఆసక్తి వున్నవారిలో కూడా లైంగిక పటుత్వం కోల్పోతున్నట్టు తేలింది. 
 
మానసిక సమస్యలకు తోడు వ్యాయామం లేకపోవడం, మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లు ఉంటే, అటువంటి వారి పరిస్థితి మరీ దుర్భరంగా మారుతోందని సెక్సాలజిస్టులు వివరిస్తున్నారు. ఫలితంగా, ఉద్యోగుల్లో జీవనశైలి జబ్బులు పెరిగిపోతున్నాయని, యువతుల్లో ఊబకాయం, హార్మోన్‌ సమస్యలు, యువకుల్లో వీర్యకణాల లోపం సంతాన లేమి సమస్య పెరగడానికి ప్రధాన కారణాలని చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెమట అస్సలు పట్టకూడదా....?