Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెమట అస్సలు పట్టకూడదా....?

అధిక చమట వల్ల చాలా అసౌకర్యంగా ఫీలవుతుంటారు. కొన్నిసార్లు ఒత్తిడి, అలసట కూడా అధిక చెమటకి కారణమవుతుంది. కొన్ని గృహ ఔధాలతో దీన్ని సులువుగా నివారించవచ్చు. ఎండలో బయటకు వెళ్ళినా లేదా కరెంటు పోయినా ఈ బాధ తప్

చెమట అస్సలు పట్టకూడదా....?
, ఆదివారం, 6 ఆగస్టు 2017 (13:27 IST)
అధిక చమట వల్ల చాలా అసౌకర్యంగా ఫీలవుతుంటారు. కొన్నిసార్లు ఒత్తిడి, అలసట కూడా అధిక చెమటకి కారణమవుతుంది. కొన్ని గృహ ఔధాలతో దీన్ని సులువుగా నివారించవచ్చు. ఎండలో బయటకు వెళ్ళినా లేదా కరెంటు పోయినా ఈ బాధ తప్పదు. ఇది చాలదన్నట్లు కొందరికి మిగతా వారి కంటే ఎక్కువ చెమట పడుతుంది. చెమట కారణంగా ఎబ్బెట్టుగా కూడా ఉంటుంది. దుస్తులు పాడవడం, దుర్గంధం వెదజల్లడం జరుగుతుంది. ప్రధానంగా శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, శరీరంలోని వివిధ గ్రంధులు శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసే క్రమంలో చెమట వస్తుంది. 
 
అంతేకాకుండా చెమట గ్రంధులు వివిధ రకాల వేరే కారణాల వల్ల కూడా ప్రేరేపించబడతాయి. ముఖ్యంగా హార్మోన్‌లలో మార్పుల వల్ల, ఒత్తిడి, ఆందోళన, భయం వల్ల కూడా ఇవి ప్రేరేపించడబడి చెమట రావటానికి కారణమవుతుంది. చెమట విడుదల వయస్సు, జీన్స్, ఫిట్నెస్ లెవల్‌పై ఆధారపడుతుంది. చెమట ఎలా ఉన్నా అధిక చెమటను నివారిచండం పెద్ద సమస్యేమీ కాదంటున్నారు వైద్య నిపుణులు. గృహంలోని ఔషధాలతోనే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చుంటున్నారు. 
 
ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్‌లు, ఒక స్పూన్ కలుపుకుని  కలుపుకుని తాగాలి. ఇలా తాగితే శరీరంలో పి.హెచ్. విలువలు సమతుల్య స్థాయిలోకి చేరి అధిక చెమట తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రెండు చెంచాల వెనిగర్‌ను స్నానం చేసే నీటికి కలిపి స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయట. అంతేకాదు ఆలుగడ్డలను ఎక్కువగా తింటే చెమటను సమర్థవంతగా ఎదుర్కోవచ్చు. చెమట ఎక్కువగా ఎక్కడ పడుతుందో అక్కడ రుద్ది కొద్ది సేపు తర్వాత కడిగేయాలి. గ్రీన్ టీలో ఆస్ట్రినేంట్ లక్షణాలు ఉంటాయి. మరుగుతున్న నీటిలో గ్రీన్ టీ బ్యాగ్‌లు వేసి కొద్ది సేపు ఉంచాలి. స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి.  అలాగే గ్రీన్ టీతో ఐస్ టీని తయారుచేసి దీన్ని చర్మంపై రాసుకుంటే చెమట బాధ నుంచి ఉపశమనం కలుగుతుందట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెసల్ని క్రమం తప్పకుండా తినేవాళ్లు....