Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం పురస్కరించుకుని వాకథాన్‌ నిర్వహించిన సియా లైఫ్‌ హాస్పిటల్స్‌

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (23:07 IST)
అంతర్జాతీయ ప్రమాణాలతో ఆరోగ్య సేవలనందించిన వంద పడకల మల్టీ స్పెషాలిటీ టెరిషయరీ, క్వాటెర్నరీ లెవల్‌ కేర్‌ హాస్పిటల్‌ సియా లైఫ్‌ హాస్పిటల్స్‌ నేడు ఓ వాకథాన్‌ను అంతర్జాతీయ మధుమేహ దినోత్సవ సందర్భంగా కొండాపూర్‌లోని ప్రశాంత్‌ నగర్‌ కాలనీలో ఉన్న నేరెళ్ల లేక్‌ పార్క్‌ వద్ద నిర్వహించింది. ఈ వాకథాన్‌ కొండాపూర్‌లోని సియా లైఫ్‌ హాస్పిటల్‌ వద్ద ముగిసింది. సామాన్య ప్రజల నడుమ మధుమేహం పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ వాక్‌ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు, సియా లైఫ్‌ డాక్టర్లు, సిబ్బంది ఈ వాక్‌లో పాల్గొన్నారు.
 
అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం పురస్కరించుకుని పలు పార్క్‌లలో మధుమేహ పరీక్షలను సైతం చేసింది. ఈ పరీక్షలలో ఎవరికైనా చికిత్స అవసరమైన పక్షంలో వారికి కూపన్లు అందజేసి సియా లైఫ్‌ హాస్పిటల్స్‌ వద్ద వాటిని కన్సల్టేషన్‌/పరీక్షలకు మార్చుకునే అవకాశం కల్పించింది. రేపటిని కాపాడుకోవడం కోసం అవగాహన మెరుగుపరచడం అనే నేపథ్యంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు . ప్రజలకు అవగాహన కల్పించడం కోసం పలు కార్యక్రమాలను సియా లైఫ్‌ నిర్వహిస్తుంది. 
 
సియా లైఫ్‌ హాస్పిటల్‌లో డయాబెటాలజీ, ఎండోక్రినాలజీ కన్సల్టెంట్‌ ,డాక్టర్‌ సి అభినందన మాట్లాడుతూ ‘‘తగిన రీతిలో జీవనశైలి ఉండకపోవడం, సరైన డైట్‌ అనుసరించకపోవడం వల్ల ఇటీవలి కాలంలో మధుమేహుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీనికి తోడు మధుమేహ లక్షణాలను సైతం ప్రజలను గుర్తించలేకపోవడం వల్ల మరింతగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించడంతో పాటుగా మధుమేహ పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం అవసరం’’ అని అన్నారు.
 
తమ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకుంటున్న రోగులకు ఈ వాక్‌థాన్‌లో భాగంగా సత్కరించారు. ఈ వాకథాన్‌లో పాల్గొనడం వల్ల మధుమేహ నివారణ, నియంత్రణ గురించి మరింతగా తెలుసుకునే అవకాశం తమకు లభించిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments