శాస్త్ర పరిజ్ఞానం వృద్ది చెందే కొద్దీ మానవ ఉదరంలో మైక్రోబయోమ్‌ను అర్థం చేసుకోవడంలో న్యూట్రిషన్, గ్యాస్ట్రోఇంటెస్టినియల్ ఆరోగ్య నిపుణులకు మరింత ఆసక్తిని రేక్తిస్తోంది. మనం తీసుకునే ఆహారం మన ప్రేగులలోని సూక్ష్మజీవులు (గట్ మైక్రోబయోమ్)పై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటుగా వ్యాధుల నివారణ కూడా సాధ్యమవుతుంది. అయితే అది ఎలా జరుగుతుందనేది ఇప్పటికీ వారికి అంతు చిక్కని అంశం. బాదములపై చేసిన నూతన అధ్యయనం వీరి సందేహాన్ని కాస్త తీర్చే అవకాశం ఉంది. బాదములపై ఇటీవల నిర్వహించిన క్లీనికల్ అధ్యయనం ద్వారా గట్ మైక్రోబయోమ్ ఏ విధంగా బాదములు బ్యుటిరేట్ ఉత్పత్తి చేసేలా చేస్తాయని తెలుసుకోవడం జరిగింది. పలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే మైక్రో బయోటా ఉత్పత్తి బ్యుటిరేట్.
నూతన అధ్యయనం కనుగొన్న దాని ప్రకారం బాదముల వల్ల బ్యుటిరేట్ గణనీయంగా పెరుగుతుంది. పెద్దప్రేగులలో ఉండే ప్రయోజనకారి అయిన షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ (ఎస్‌సీఎఫ్‌ఏ) రకం ఈ బ్యూటిరేట్. ఈ బ్యూటిరేట్‌ను పేగులలో ఉండే మైక్రోబయోమ్‌లు ఫైబర్‌ను జీర్ణించుకున్నప్పుడు ఉత్పత్తి చేస్తాయి. నిజానికి కొలనోసైట్స్‌కు ఇంధన వనరు ఈ ఫైబర్. మానవ ఆరోగ్యానికి ఇది విస్తృత స్ధాయి ప్రయోజనాలు అందిస్తుంది. నిద్ర నాణ్యత మెరుగుపడటంతో పాటుగా వాపులతో పోరాటం చేసేందుకు, ప్రేగు క్యాన్సర్ ప్రమాదం తగ్గించేందుకు సైతం తోడ్పడుతుంది. బాదములను తినడం వల్ల స్టూల్ (మలం) ఔట్‌పుట్ కూడా పెరుగుతుంది.
కింగ్స్ కాలేజీ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ కెవిన్ వీలాన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం గట్ మైక్రోబయోటాపై బాదముల ప్రభావం, గట్ మైక్రోబయోటా వైవిధ్యత, గట్ ట్రాన్సిట్ టైమ్ గురించి కనుగొనే ప్రయత్నం చేసింది. ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా దీనికి అవసరమైన సహకారం అందించింది. బ్యూటిరేట్ వంటి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్‌ల ఉత్పత్తి ద్వారా గట్ మైక్రోబయోటా మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కొలన్ (పెద్ద ప్రేగు)లోని కణాలకు ఇంధన వనరులుగా ఈ మాలిక్యూల్స్ పనిచేస్తాయి. ఇవి ఉదరంలోని ఇతర పోషకాల స్వీకరణనూ నియంత్రిస్తాయి. అలాగే రోగ నిరోధక వ్యవస్ధను సమతుల్యం చేయడంలోనూ తోడ్పడుతుంది అని కింగ్స్ కాలేజీ లండన్‌లో ప్రొఫెసర్ ఆఫ్ డైటెటిక్స్, కెవిన్ వీలాన్ అన్నారు.
ఈ పరిశోధనలో భాగంగా 87 మంది ఆరోగ్యవంతమైన పెద్దలను ఎంచుకున్నారు. వీరంతా కూడా 18 నుంచి 45 సంవత్సరాల లోపు స్త్రీ, పరుషులు. వీరంతా కూడా రోజుకు 2 లేదా అంతకుమించి స్నాక్స్‌ను రోజూ తింటుంటామని చెప్పుకున్నారు. వీరంతా కూడా సూచించిన మొత్తంకంటే తక్కువ ఫైబర్‌ను తమ ఆహారంలో తీసుకునే వారు. వీరిని పలు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపుకు ప్రతి రోజూ 56 గ్రాముల హోల్ అల్మండ్స్ అందిస్తే, మరో గ్రూప్‌కు బాదముల పొడి అందించారు. మరో గ్రూప్‌కు దీనికి సరిపోయే రీతిలో స్నాక్ మఫిన్స్ అందించారు. ప్రతి స్నాక్‌తో పాటుగా 100మిల్లీ లీటర్ల నీటిని సైతం తీసుకోవాల్సిందిగా వీరికి సూచించడం జరిగింది.
ఈ అధ్యయనంలో భాగంగా ఫీకల్ బైఫిడో బ్యాక్టీరియా, ఫీకల్ మైక్రోబయోటా కంపోజిషన్, డైవర్శిటీ, ఫీకల్ ఎస్‌సీఎఫ్‌ఏ, హోల్‌గట్ ట్రాన్సిట్ టైమ్, గట్ పీహెచ్, స్టూట్ ఔట్‌పుట్ (ఫ్రీక్వెన్సీ మరియు స్థిరత్వం రెండూ ) మరియు గట్ లక్షణాలు పరిశీలించారు. ఈ అధ్యయనంలో ప్రొషెసర్ వీలర్ మరియు అతని సహచరులు కనుగొన్న దాని ప్రకారం బాదములు తీసుకున్న వారిలో బ్యూటిరేట్ గణనీయంగా వృద్ధి చెందడంతో పాటుగా స్టూల్ ఫ్రీక్వెన్సీ సైతం వృద్ధి చెందింది. అంతేకాదు, బాదములు తినడం వల్ల ఎలాంటి ప్రతి కూల ప్రభావాలూ కలిగించకుండా ఫైబర్‌ను పెంచడానికి ఓ మార్గమని సూచిస్తుంది. ఇది మైక్రోబయోటా పనితీరుపై సానుకూల మార్పులను సూచిస్తుంది.
ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం బాదములను తినడం వల్ల బ్యాక్టీరియల్ మెటబాలిజంకు ప్రయోజనం కలుగుతుంది. ఇది మానవ ఆరోగ్యంపై సైతం సానుకూల ప్రభావాన్ని తీసుకువచ్చే సామర్ధ్యం ఉంది అని ప్రొఫెసర్ వీలాన్ అన్నారు. న్యూట్రిషన్ మరియు వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ బ్యూటీరేట్ అనేది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్‌లో ఒకటి. ఉదర ఆరోగ్యం మెరుగుపరచడంలో అతి ముఖ్యమైన పాత్రను ఇది పోషిస్తుంది. ఉదరంలోని బ్యాక్టీరియా ఫైబర్‌ను జీర్ణించుకున్నప్పుడు ఇది ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల నిద్ర నాణ్యత మెరుగుపడటంతో పాటుగా వాపులతోనూ పోరాడుతుంది. కొలన్ క్యాన్సర్ ప్రమాదం తగ్గించడంలోనూ బ్యూటిరేట్ సహాయపడుతుంది. అందువల్ల, గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ లెవల్స్ మెరుగుపరిచే ఆహారాన్ని తీసుకోవడంపై మనం దృష్టి సారించాలి. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం బాదములు తినడం వల్ల కొలన్‌లో బ్యూటిరేట్ పెరుగుతుంది. బాదముల వల్ల అదనపు ప్రయోజనాలైనటువంటి ముఫా, టోటల్ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం మరియు ఇతర పోషకాలు కూడా ఉంటాయి అని అన్నారు.
బాదములలో 100గ్రాములకు 3.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనితో పాటుగా 15 అత్యవసర పోషకాలు సైతం ఉంటాయి. దీనిలో మెగ్నీషియం 100 గ్రాములకు 81 మిల్లీ గ్రాములు, పొటాషియం 220 మిల్లీగ్రాములు, విటమిన్ ఈ 7.7 మిల్లీ గ్రాములు ఉంటాయి.