Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 27 February 2025
webdunia

ఈ దీపావళి వేళ బాదములతో చక్కటి ఆరోగ్యాన్ని బహుమతిగా అందించండి

Advertiesment
Almonds
, గురువారం, 20 అక్టోబరు 2022 (20:13 IST)
దీపకాంతుల పండుగ తనతో పాటుగా మహోన్నతమైన వేడుకలను కూడా తీసుకువస్తుంది. ప్రియమైన వారిని కలుసుకునే అవకాశమూ అందిస్తుంది. దీపావళి పండుగను మనమంతా వైభవోపేతంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్న వేళ, గతానికంటే కూడా మరింత వేడుక చేయడానికి మనమంతా లక్ష్యంగా చేసుకోవాలి. దీపాల కోసం స్ధానిక విక్రేతలకు మద్దతు అందించడం మొదలు ఆరోగ్యవంతమైన స్నాక్స్‌, మిఠాయిలను తయారుచేయడం, పర్యావరణ అనుకూల వేడుకలు చేయడం, ఇలా సానుకూల మార్పులను తీసుకువచ్చేందుకు ఎన్నో అవకాశాలున్నాయి.
 
పండుగ స్వీట్లు, స్నాక్స్‌ అనేవి అన్ని పండుగల్లాగానే దీపావళి పండుగలో అంతర్భాగంగా ఉంటాయి. బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం అనేది ప్రియమైన వారి పట్ల చూపే ప్రేమ, కృతజ్ఞతకు సూచిక. ఈ సంవత్సరం ఈ భావనను మారుద్దాం, ఆరోగ్యవంతమైన స్నాక్స్‌, స్వీట్లు వైపు పయనిద్దాం. చక్కటి ఆరోగ్యానికి ఉత్తమ బహుమతి బాదములు. 
 
ఈ బాదములలో 15 రకాల పోషకాలు ఉంటాయి. అవి విటమిన్‌ ఇ, డైటరీ ఫైబర్‌, ప్రొటీన్‌, రిబోఫ్లావిన్‌, మాంగనీస్‌, ఫోలేట్‌ వంటివి ఉంటాయి. పలు శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం క్రమం తప్పకుండా బాదములు తింటే పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో గుండె ఆరోగ్యం మెరుగుపడటం, మధుమేహం, చర్మ ఆరోగ్యం మెరుగుపడటం, బరువు నియంత్రణలో ఉండటం వంటివి ఉన్నాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా బాదములను ఆరోగ్యవంతమైన బహుమతిగా నిలుపుతున్నాయి. అంతేకాదు, పోషక విలువలు తక్కువగా ఉండే స్వీట్లు, రుచులకు అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా ఈ దీపావళి పండుగ వేళ నిలుస్తుంది.
 
న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలాకృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘పండుగ సమయాలలో, మన సంప్రదాయాలలో ప్రియమైన వారి నుంచి స్వీట్లు తీసుకోవడం, వారికి వాటిని అందించడం ఓ భాగం. అత్యధిక కేలరీలు నిండి ఉండే ఈ తియ్యందనాలు స్వల్పకాలం పాటు మనకు వినూత్న రుచులను అందించినా, దీర్ఘకాలంలో  మన  ఆరోగ్యానికి అవి మంచిని చేయవు. అందువల్ల, మీతో పాటుగా మీ ప్రియమైన వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. లడ్డూల బాక్స్‌కు బదులుగా బాదముల బాక్స్‌ను అందించండి. బాదములు కేవలం ఆరోగ్యవంతమైనవి మాత్రమే కాదు, అవి ఆకలిని సైతం తీర్చగలవు. భోజనానికి, భోజనానికి మధ్య వీటిని తీసుకుంటే ఆకలిని పోగొడతాయి. అది మాత్రమే కాదు, మధుమేహులకు బాదములు ప్రయోజనం కలిగిస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. బాదములతో టోటల్‌, ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. ఆరోగ్యవంతమైన డైట్‌లో భాగం చేసుకున్నట్లయితే గుండెకు నష్టం చేసే సమస్యలను దూరంగా పెడతాయి’’ అని అన్నారు.
 
సుప్రసిద్ధ భారతీయ టెలివిజన్‌, చిత్ర నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ, ‘‘నా వరకూ దీపావళి అంటే, స్నేహితులు, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అత్యుత్తమ సమయం. ఈ పండుగ తనతో పాటుగా సంప్రదాయ బహుమతులనూ వెంట తీసుకువస్తుంది. ఆరోగ్యం, ఆహార ప్రాధాన్యతల పట్ల అప్రమత్తంగా ఉండే వ్యక్తిగా నేను అదే కోణంలో బహుమతులు అందిస్తుంటాను. బాదములంటేనే చక్కటి ఆరోగ్య బహుమతి. వాటిని ప్రియమైన వారితో పంచుకోవడం అనేది వారి ఆరోగ్యం, శ్రేయస్సుకు నాదైన తోడ్పాటును ప్రదర్శించుకునే అద్భుతమైన అవకాశంగా నిలుస్తుంది’’ అని అన్నారు. అందువల్ల, ఈ దీపావళిని ఆలోచాత్మకంగా, బాదములతో వేడుకచేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మందార పువ్వును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుంది?