Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదులో పీపుల్స్‌ ఆర్గనైజేషన్స్‌ ఆన్‌ హాన్సెన్స్‌ డిసీజ్‌ రెండవ అంతర్జాతీయ సదస్సు

Advertiesment
doctor
, గురువారం, 3 నవంబరు 2022 (23:15 IST)
పీపుల్స్‌ ఆర్గనైజేషన్స్‌ ఆన్‌ హాన్సెన్స్‌ డిసీజ్‌ రెండవ అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్‌లో నవంబర్‌ 6 నుంచి 8వ తేదీ వరకూ జరుగనుంది. సాసాకావా లెప్రసీ (హాన్సెన్స్‌ డిసీజ్‌) నిర్వహిస్తోన్న ఈ సదస్సును తమ డోంట్‌ ఫర్‌గెట్‌ లెప్రసీ (కుష్టువ్యాధిని మరిచిపోవద్దు) కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సును 21వ అంతర్జాతీయ లెప్రసీ కాంగ్రెస్‌ (ఐఎల్‌సీ)కు ముందుగా నిర్వహించబోతున్నారు. ఈ సదస్సు ద్వారా లెప్రసీ రంగంలో కీలకమైన వాటాదారులను ఒకే దరికి తీసుకురానుంది.
 
దాదాపు 20 దేశాల నుంచి 100 మందికి పైగా డెలిగేట్లు అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటారని అంచనా. దీనిలో 20కు పైగా పీపుల్స్‌ ఆర్గనైజేషన్స్‌ మరియు తొమ్మిది సపోర్టింగ్‌ ఆర్గనైజేషన్స్‌, యుఎన్‌ స్పెషల్‌ రాపోర్టియర్‌ ఆన్‌ లెప్రసీ తో పాటుగా ప్రత్యేక అతిథులుగా మిస్‌ వరల్డ్‌ బ్రెజిల్‌ మరియు మిస్‌ సుప్రా ఇంటర్నేషనల్‌ ఇండియా పాల్గొననున్నారు. వీరితో పాటుగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ గుడ్‌ విల్‌ అంబాసిడర్‌ ఫర్‌ లెప్రసీ ఎలిమినేషన్‌ యోహీ సాసాకావా సైతం పాల్గొననున్నారు.
 
మూడు రోజుల పాటు హైబ్రిడ్‌ ఆన్‌ సైట్‌/ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ అంతర్జాతీయ సదస్సును ‘హాన్సెన్స్‌ వ్యాధి బారిన పడిన బాధిత వ్యక్తుల గౌరవాన్ని ప్రోత్సహించడానికి పీపుల్స్‌ ఆర్గనైజేషన్స్‌ యొక్క బాధ్యతలు మరియు సామర్థ్యం బలోపేతం చేయడంతో పాటుగా పెంపొందించడం’ నేపధ్యంతో నిర్వహిస్తున్నారు.ఈ సదస్సులో భాగంగా సామర్ధ్య నిర్మాణం, చక్కటి భాగస్వామ్యాలను ఏర్పరచడం కూడా చేస్తారు. చివరి రోజు పలు సైడ్‌ ఈవెంట్స్‌ కూడా జరుగనున్నాయి. దీనిలో 18 సంస్ధలు తమ కార్యకలాపాలను పరిచయం చేయనున్నాయి. వీటిలో చాలా సంస్థలు డోంట్‌ ఫర్‌గెట్‌ లెప్రసీ ప్రచారంలో చురుగ్గా ఉన్నాయి.
 
ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా మిస్‌ వరల్డ్‌ బ్రెజిల్‌ (లెటిసియా సీజర్‌ డా ఫ్రోటా), మిస్‌ సుప్రానేషనల్‌ ఇండియా (ప్రజ్ఞా అయ్యగారి) నిలువనున్నారు. వీరు లెప్రసీ పట్ల తాము ఏ విధంగా అవగాహన కల్పించేదీ వెల్లడించడంతో పాటుగా ఈ వ్యాధి బారిన పడిన వారి పట్ల వివక్ష లేదంటే ఆ వ్యాధి పట్ల ఉన్న అపోహలను పోగొట్టడానికి ఏ విధంగా తోడ్పడేది వివరిస్తారు.
 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీపుల్స్‌ ఆర్గనైజేషన్స్‌ పాల్గొనే ఐఎల్‌సీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా నవంబర్‌ 9వ తేదీన భారతదేశపు అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌ ఎఫెక్టడ్‌ బై లెప్రసీ అధ్యక్షురాలు మాయా రణవారీ ఈ సంస్థల సూచనలు వెల్లడించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శీతాకాలంలో తినాల్సిన 7 కూరగాయలు ఇవే