Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈటీ ఎసెంట్‌ జాతీయ అవార్డు గెలుచుకున్న దక్కన్‌ హెల్త్‌ కేర్‌

Advertiesment
ET Ascent National Award
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (18:13 IST)
సుప్రసిద్ధ న్యూట్రాస్యూటికల్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీ  దక్కన్‌ హెల్త్‌ కేర్‌ లిమిటెడ్‌, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈటీ ఎసెంట్‌ నేషనల్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ వద్ద ఆరోగ్య సంరక్షణ విభాగంలో ‘బెస్ట్‌ సైంటిఫిక్‌ సప్లిమెంట్స్‌ మాన్యుఫాక్చరర్‌’ అవార్డును అందుకుంది. దక్కన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌  చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ శ్రీమతి మోహితా గుప్తా ఈ అవార్డును  బెంగళూరులోని ఎంజి రోడ్‌ వద్ద నున్న తాజ్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో అందుకున్నారు.
 
లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ మరియు హెచ్‌బీఎస్‌ పూర్వ విద్యార్ధి శ్రీమతి మోహిత. పఠనం పట్ల అమితాసక్తి కలిగిన ఆమె నూతన ప్రాంగణాలను అన్వేషించడం పట్ల సైతం ఆసక్తిని కనబరుస్తుంటారు. గ్రామీణ భారీతీయులకు సైతం చేరుకునేలా అత్యధిక ప్రభావం చూపే న్యూట్రిషన్‌ ఇంటెన్సివ్‌ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నారు.
 
ఈ అవార్డు అందుకోవడం పట్ల దక్కన్‌ హెల్త్‌ కేర్‌ లిమిటెడ్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ శ్రీమతి మోహితా గుప్తా మాట్లాడుతూ, ‘‘ ఈటీ ఎసెంట్‌ నేషనల్‌ అవార్డు అందుకోవడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాము. నేటి యుగం డిజటల్‌గా బాగా అలవాటుపడిన సమాజాన్ని కలిగి ఉంది. డిజిటల్‌ పరికరాలపై అధిక  సమయం గడపటమనేది పిల్లలు, పెద్దలలో అతి సాధారణ అంశంగా కనబడుతుంది. మీరు అనవచ్చు, మా పని చేసుకుంటున్నాము అని, కానీ మీరు డిజిటల్‌ తెరలపై గడిపే ప్రతి క్షణమూ మీ మెడ, మెదడు, కళ్లు సమస్యల బారిన భవిష్యత్‌లో పడేందుకు అవకాశాలను తీసుకువస్తున్నాయని మాత్రం చెప్పకతప్పదు.
 
యువతతో పాటుగా పెద్ద వయసు వ్యక్తులకు సైతం ప్రమాదకరమైనది డిజిటల్‌ స్ర్కీన్‌ టైమ్‌. అందువల్ల ప్రతి ఒక్కరూ స్వీయ సంరక్షణను అభ్యసించడంతో పాటుగా నివారణ పైన దృష్టి సారించాలి. లేదంటే ఇది నిశ్శబ్దమహమ్మారిగా భవిష్యత్‌లో మారే అవకాశాలు లేకపోలేదు. శాస్త్రీయంగా నిరూపితమైన న్యూట్రాస్యూటికల్స్‌ను  మేము అభివృద్ధి చేశామని వెల్లడించేందుకు ఆనందిస్తున్నాయి. ఇవి నేడు ఆధునిక కుటుంబాలలో  గ్రోసరీ జాబితాలో తప్పసనిసరిగా మారడంతో పాటుగా ఎన్నో జీవనశైలి మార్పుల అవసరాలకూ తోడ్పడుతున్నాయి’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సలాడ్‌ తినే అలవాటు వుందా? ఐతే ఇటు లుక్ వేయండి