Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జహీరాబాద్ బీజీపీ ఎంపీ అభ్యర్థిగా జీవిత రాజశేఖర్!

Advertiesment
జహీరాబాద్ బీజీపీ ఎంపీ అభ్యర్థిగా జీవిత రాజశేఖర్!
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (12:42 IST)
తెలుగు సీనియర్ నటి జీవిత రాజశేఖర్ ఇక నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. ఇటీవలే ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ శాఖతో కలిసి ఆమె పని చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే 2024లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారనీ, అదీకూడా జహీరాబాద్ స్థానం నుంచి ఆమె  పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
గత 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డి ఏకంగా 138947 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలించారు. ఈ దఫా ఈ స్థానం నుంచి సినీ గ్లామర్ కలిగిన జీవిత రాజశేఖర్‌ను బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
 
మరోవైపు, వచ్చే యేడాది తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో  పార్టీని విజయపథంలో నడిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో బీజేపీ పెద్దలు ఉన్నారు. అందుకే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు తరచుగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తూ, పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. 
 
మరోవైపు, తెలంగాణ బీజేపీశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రజా సంగ్రామం పేరుతో చేపట్టిన పాదయాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఆయన ఇప్పటికే నాలుగు విడతల పాదయాత్రను పూర్తిచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు ఇలాకాలో సీఎం జగన్ పర్యటన