Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో తన కెప్టెన్ల కోసం సీపీఆర్ శిక్షణ సదస్సు నిర్వహించిన రాపిడో

CPR training
, గురువారం, 8 సెప్టెంబరు 2022 (16:24 IST)
భారతదేశంలోని ప్రముఖ బైక్-టాక్సీ, ఆటో సర్వీస్ అయిన రాపిడో, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయాలనే దృఢనిశ్చయంతో ఉంది. దీని గురించి అవగా హన కల్పించేందుకు, ఈ విషయంలో తమ కెప్టెన్‌లకు నైపుణ్యం అందించేందుకు, కంపెనీ హైదరాబాద్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సీపీఆర్ శిక్షణ సమావేశాన్ని నిర్వహించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తూ నగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిన శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పి టల్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

 
మెడికల్ ఎమర్జెన్సీలు ఊహించనివి, కొన్ని సెకన్ల ఆలస్యాలు ప్రజల ప్రాణాలను బలిగొంటాయి. కార్డియో పల్మోనరీ రెసిసిటేషన్ (CPR) పై ప్రాథమిక జ్ఞానం చాలా మంది జీవితాలను రక్షించడంలో సమగ్ర పాత్ర పోషి స్తుంది. ఈ సెషన్‌ను నిర్వహించడం వెనుక బ్రాండ్ ప్రధాన లక్ష్యం గుండె ఆగిపోవడం వంటి ప్రాణాంతక వైద్య పరిస్థితులలో ప్రజలకు అవసరమైన సహాయం అందేలా చూడడమే. పరిస్థితికి సంబంధించిన ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా దాని కెప్టెన్‌లను మొదటి ప్రతిస్పందనదారులుగా ఉండేలా రాపిడో చేస్తుంది. ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ వర్క్‌షాప్ కెప్టెన్‌లు, కాబోయే రైడర్‌లు, చుట్టుపక్కల వారికి భద్రతా భావాన్ని అందిస్తుంది. 

 
ఇదే విషయమై రాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ సంక మాట్లాడుతూ, “మనం ఇంట్లో ఉన్నా, పనిలో ఉన్నా లేదా రైడ్‌లో ఉన్నా, ఊహించని క్షణాల్లో ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితులు ఎదురవుతాయి. దురదృష్టవశాత్తూ, కార్డియాక్ అరెస్ట్ బాధితుల్లో ఎక్కువ శాతం మంది సహాయం స్పాట్ వద్దకు వచ్చే లోపు చివరి శ్వాస విడుస్తారు. దీనికి ప్రధాన కారణం అవసరమైన సహాయాన్ని అందించడానికి సమీపం లో నైపుణ్యం కలిగిన సీపీఆర్ నిపుణులు లేకపోవడమే. ఈ సీపీఆర్ సెషన్‌తో, మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో సకాలంలో సహాయం గురించి అవగాహన తీసుకురావాలని మేం కోరుకుంటున్నాం. దీనికి, శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సరైన భాగస్వామి అవుతుందని మేం భావించాం. వారు అందించిన మద్దతుకు గాను వారికి మా కృతజ్ఞతలు. సకాలంలో చేసే సీపీఆర్ సెషన్‌తో ప్రాణాలను రక్షించడంలో రాపిడోలో మేం సహకరించ గలమని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెండకాయలను గర్భిణీ స్త్రీలు తినవచ్చా? తినకూడదా?