Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవగాహనతోనే ఆస్ట్రియోపోరోసిస్‌ నివారణ

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (19:57 IST)
ఎముకలు బోలుగా మారే వ్యాధినే ఆస్టియోపోరోసిస్‌‌గా పేర్కొంటారు. ఇది మహిళల్లో బాగా కనిపించే వ్యాధి. మధ్య వయసు దాటాక దాడి చేసే ఈ వ్యాధి ఆధునిక జీవనశైలి, తగిన వ్యాయామం లేకపోవడంతో పాటు అవగాహన లేక దీని దుష్ప్రభావాలు ఎదుర్కుంటున్నవారెందరో. ఈ నేపధ్యంలో ఈ వ్యాధి ముందస్తు హెచ్చరిక సంకేతాలు, ఆ వ్యాధికి గురయ్యాక శరీరంలో వచ్చే మార్పులు, తగ్గించుకునే మార్గాల గురించిౖ హెదరాబాద్‌లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌ ఆర్థ్రోస్కోపీ సర్జన్‌ డాక్టర్‌ వీరేంద్ర ముద్నూర్‌ ఇలా వివరిస్తున్నారు.

 
బలం నుంచి బోలు వరకూ...
శరీరంలోని మస్క్యులోస్కెలెటల్‌ వ్యవస్థ వందలాది కదిలే మూలకాలను (ఎముకలు, కండరాలు, స్నాయువులు, మృదులాస్థి) కలిగి ఉంటుంది. ఇవి శరీరం సమతుల్యతతో కదలడానికి, సరైన విధంగా పనిచేయడానికి సహకరిస్తాయి. అయితే అన్ని శారీరక అంతర్గత అవయవాలలాగే ఈ భాగాలు గాయపడవచ్చు, కాలక్రమేణా బలహీనపడవచ్చు లేదా అనారోగ్యాలకు గురికావచ్చు.

 
ఎముకలు చాలా బలంగా ఉన్నప్పటికీ, అవి సజీవ కణజాలంతో తయారవుతాయి. ఇవి నిరంతరం విచ్ఛిన్నమవుతూ తిరిగి పునర్నిర్మించబడతాయి. మనిషికి 20 ఏళ్ల వయస్సు వచ్చే వరకు శరీరం ఇప్పటికే ఉన్న ఎముక కణజాలాన్ని విచ్ఛిన్నం చేయడం కంటే త్వరగా కొత్త ఎముకలను నిర్మించగలదు. పెరిగే వయస్సుతో, ఈ ప్రక్రియ మందగిస్తుంది. పాత ఎముక కణజాలం భర్తీ చేయగల దానికంటే వేగంగా క్షీణించవచ్చు. ఇది ఎముకలు మరింత సన్నగా  పెళుసుగా మారడానికి ఫలితంగా బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. ఈ వ్యాధి ఎముక పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి, ఆస్టియోపోరోసిస్‌ వ్యాధికి సంబంధించిన హెచ్చరిక సంకేతాలను గుర్తించడం చాలా అవసరం.

 
లక్షణాలివే...
చిగుళ్లు తగ్గుముఖం పట్టడం: దంతాలు సాధారణంగా దవడ ఎముకకు అతుక్కొని ఉంటాయి. దవడ ఎముక సన్నబడటం ప్రారంభించిన తర్వాత, చిగుళ్ళు తగ్గడం కూడా గమనించవచ్చు. 
గ్రిప్‌ బలం తగ్గడం: వ్యక్తులు కింద పడిపోవడాన్ని నివారించడానికి మంచి పట్టు, సమతుల్యత కండరాల బలం అవసరం. అలాగే, తగ్గిన పట్టు బలం పడిపోయే అవకాశాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తి హ్యాండ్‌గ్రిప్‌ వదులైనప్పుడు, అది ఈ వ్యాధికి సంకేతం. ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలకు సంబంధించి చేసిన ఓ అధ్యయనంలో బలహీనమైన హ్యాండ్‌గ్రిప్, తక్కువ ఎముక ఖనిజ సాంద్రత మధ్య సంబంధాన్ని పరిశోధకులు కనుగొన్నారు.

 
తిమ్మిరి/ నొప్పులు: కండరాల తిమ్మిరి, నొప్పులు సాధారణమైనవే అని తరచుగా నిర్లక్ష్యం చేస్తాం. అయితే ఇది బోలు ఎముకల వ్యాధి  ప్రారంభ సూచన. అత్యంత కీలకమైన ఎముక బిల్డర్‌ అయిన విటమిన్‌ డిలో గణనీయమైన లోపాన్ని ఇది సూచిస్తుంది. రాత్రి సమయంలో వచ్చే తిమ్మిర్లు రక్తంలో తగ్గిన కాల్షియం, మెగ్నీషియం/ పొటాషియం స్థాయిలను సూచిస్తాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అధిక ఎముక నష్టం కలిగే అవకాశం ఉంది.

 
ఎత్తు తగ్గుదల
ఎముకల వ్యాధి ప్రారంభాన్ని గుర్తించదగిన శారీరక మార్పుల సంకేతాలలో ఒకటి ఎత్తు కోల్పోవడం. ఏ వ్యక్తి అయినా రెండు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు కోల్పోయినా లేదా వెన్నెముకలో వక్రతను ఆర్థోపెడిక్‌ ద్వారా గుర్తించినా బోలు ఎముకల వ్యాధికి రిస్క్‌ జోన్లో ఉన్నట్టే. అంటే ఈ అనారోగ్యం ఇప్పటికే వెన్నుపూసను ప్రభావితం చేసిందని అర్థం.

పెళుసుగా ఉండే వేలిగోళ్లు
ఆర్థోపెడిక్‌ ప్రకారం, ఒకరి గోళ్ల బలం ఒకరి ఎముకల ఆరోగ్యాన్ని సూచిస్తుంది. గోరు ఎముక ఆరోగ్యం ఎముక సాంద్రతతో ముడిపడి ఉంటుంది. హ్యాండ్‌ వాష్‌ లేదా ఇతర  కార్యకలాపాల తర్వాత తరచుగా విరిగిపోయే బలహీనమైన వేలిగోళ్లు ఎముక సాంద్రతలో తగ్గుదలని సూచిస్తాయి. అయితే, గోళ్లపై ప్రభావం చూపే అదనపు అంశాల్లో అత్యంత వేడి లేదా చల్లదనానికి గురికావడం, నెయిల్‌ పెయింట్‌ రిమూవర్‌ లేదా యాక్రిలిక్‌ నెయిల్‌లను క్రమం తప్పకుండా ఉపయోగించడం లేదా నీటిలో ఎక్కువసేపు ముంచడం వంటివి కూడా ఉన్నాయి.

 
నివారించడం ఇలా ...
తరచుగా వ్యాయామం చేయడం, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, ఆల్కహాల్, ఇతర డ్రగ్స్‌కు దూరంగా ఉండటం ద్వారా బోలు ఎముకల వ్యాధిని నివారించవచ్చు. ఎముక ద్రవ్యరాశికి సహాయపడే మందులు బోలు ఎముకల వ్యాధి చికిత్సలో భాగం. ఈ మందులు సాధారణంగా హార్మోన్ల ప్రభావాలను కలిగి ఉంటాయి, ఎముకల అభివృద్ధిని ప్రేరేపించడానికి ఈస్ట్రోజెన్‌తో సమానంగా పెరుగుతాయి లేదా పనిచేస్తాయి.

 
ఈ వ్యాధి దాని ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలను కలిగి ఉండదు. ఆస్టియోపెనియాలో తక్కువ ఎముక సాంద్రత, తరచుగా పగుళ్లు, భంగిమలో సమస్యలు బోలు ఎముకల వ్యాధికి సూచికలు. ఏదేమైనా ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడానికి ఎముక ఆరోగ్యం జీవన నాణ్యత రెండింటినీ మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా వ్యాధి పరీక్షలు చేయించడం అవసరం.
- డా.వీరేంద్ర ముద్నూర్‌, కన్సల్టెలంట్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్, ఆర్థోస్కోపీ సర్జన్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments