Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరుదైన లివర్ ట్యూమర్ హెపాటిక్ అడెనొమాకు కామినేని హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా సర్జరీ

Advertiesment
Kamineni Hospitals
, శనివారం, 26 మార్చి 2022 (21:04 IST)
కాలేయం ఎడమ భాగంలో హెపాటిక్ అడెనోమాతో బాధపడుతున్న 45 ఏళ్ళ డయాబెటిక్, హైపర్ టెన్సివ్ రోగికి కామినేని హాస్పిటల్, విజయవాడ వైద్యులు విజయవంతంగా చికిత్స చేయగలిగారు.

 
హెపాటిక్ అడెనోమా అనేది అరుదైన కాలేయ ట్యూమర్. అది ప్రాణాంతక ట్యూమర్‌గా మారే అవకాశం కూడా ఉంది. ఈ కాలేయ ట్యూమర్‌నే హెపటోసెల్యులర్ అడెనొమా లేదా లివర్ సెల్ అడెనొమా అని కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా ఇది మహిళలను బాగా ప్రభావితం చేస్తుంది. కుటుంబ నియంత్రణ మాత్రలతో ముడిపడి ఉన్నట్లుగా చెబుతారు. చాలా సందర్భాల్లో హెపాటిక్ అడెనోమా ఎలాంటి లక్షణాలను కనబర్చదు. కొన్ని సందర్భాల్లో మాత్రం నొప్పి, వికారం లేదా కడుపు నిండుగా ఉన్న భావన లాంటివి కలుగుతాయి. గడ్డ బాగా పెద్దదిగా ఉన్న సందర్భాల్లో, అది పక్కనే ఉన్న ఇతర అవయవాలు, కణజాలాలపై ఒత్తిడిని కలిగించినప్పుడు ఇలాంటివి చోటుచేసుకుంటూ ఉంటాయి.

 
విజయవాడ నివాసి అయిన శ్రీ రామాంజనేయులును సాధారణ ఆరోగ్య తనిఖీ కోసం కామినేని హాస్పిటల్స్‌కు తీసుకువచ్చారు. పొత్తికడుపు అల్ట్రాసౌండ్ ఇమేజింగ్‌లో ఆయన హెపాటిక్ అడెనోమాతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. కాలేయం ఎడమ భాగంలో 7.5x7x5.6 సెం.మీ. పరిమాణంలో ట్యూమర్ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ పరిమాణంలో ఉండే హెపాటిక్ అడెనోమా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. దాంతో సర్జరీ చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. అది పెద్ద సర్జరీ కావడంతో ఆయనను కార్డియాక్ పరీక్షలకు కూడా పంపించారు. పాజిటివ్ టీఎంటీ కారణంగా యాంజియోగ్రఫీ కూడా చేయించుకున్నారు. రిస్క్‌తో ముడిపడిన సర్జరీ చేయించుకోవచ్చునని కార్డియాలజిస్టు సూచించారు.

 
ఈ సందర్భంగా రామాంజనేయులుగారు మాట్లాడుతూ, ‘‘ట్రీట్మెంట్ చక్కగా జరిగింది. డాక్టర్లు నా పట్ల ప్రదర్శించిన స్నేహపూర్వక వైఖరి ఎంతో బాగుంది. సర్జరీ మొదటి దశలో ప్రొసీజర్ గురించి నాకు చక్కగా వివరించారు. తద్వారా నా మానసిక ఆరోగ్యాన్ని కుదుటపర్చుకునేందుకు తోడ్పడ్డారు. కామినేని ఆసుపత్రిలో డాక్టర్లతో చక్కటి అనుభవం పొందాను’’ అని అన్నారు.

 
ఈ సందర్భంగా డైరెక్టర్, హెపటోబిలియరీ సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ల, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలిజస్ట్ డాక్టర్ వెలినేని శ్రీ వేంకట పవనేశ్వర్ మాట్లాడుతూ, ‘‘ ట్యూమర్, వాస్క్యులర్ క్రమరాహిత్యాలను గుర్తించేందుకుగాను సర్జరీకి ముందుగా ట్రైఫేసిక్ సీటీ అబ్డోమెన్ నిర్వహించాం. ఎడమ హెపాటిక్ ఆర్టెరీ రీప్లేస్ అయినట్లుగా అందులో తేలింది. రక్తం పెద్దగా కోల్పోకుండానే, ఆయన లెఫ్ట్ హెపటెక్టమీ చేయించుకున్నారు’’ అని అన్నారు.

 
‘‘సర్జరీ తరువాత ఎలాంటి ఇబ్బందులు లేకుండానే కోలుకున్నారు. నెఫ్రాలజిస్టు, ఫిజీషియన్ రోగి రెనల్ మరియు గ్లైకెమిక్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఆ ట్యూమర్ హెపాటిక్ అడెనొమా అని బయాప్సీ ధ్రువీకరించింది’’ అని డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ల అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్తంలో వుండే ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు పనితీరు ఏమిటి?