నేడు, క్యాటలిస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్- కోవిడ్ యాక్షన్ కొల్లాబ్(సీఏసీ)తో పాటుగా యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యుఎస్‌ఎయిడ్) భారతదేశ వ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్లిష్టమైన కోవిడ్-19 సేవలను అందించడం ద్వారా 10 మిలియన్‌ల మంది ప్రజలను చేరుకున్నట్లు వెల్లడించాయి.
వర్చువల్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో యుఎస్‌ఎయిడ్/ఇండియా హెల్త్ ఆఫీస్-డైరెక్టర్ సంగీతా పటేల్ మాట్లాడుతూ, మహమ్మారి పేద వర్గాలపై తీవ్ర ప్రభావం చూపింది. యుఎస్ ప్రభుత్వ మద్దతుతో పాటుగా యుఎస్ ఎయిడ్‌లు ఈ బీద వర్గాల ప్రజలపై సానుకూల ప్రభావం చూపుతూనే స్థానిక ప్రభుత్వాలకూ మద్దతునందించాయి. కోవిడ్-19 కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న పాఠాలతో పాటుగా చేసుకున్న భాగస్వామ్యాలు భారతదేశంతో పాటుగా ఇతర దేశాలలో కూడా ప్రజా ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరుస్తాయని భావిస్తున్నాము అని అన్నారు.
మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి మాతో పాటుగా యుఎస్ ఎయిడ్, ఇతర 350 భాగస్వాములు మా సమగ్రమైన కోవిడ్-19 మద్దతు ప్యాకేజీల ద్వారా బీద వర్గాల అవసరాలను తీర్చారు. మా సహకార కార్యక్రమాలు దాదాపు 10 మిలియన్‌ల మంది జీవితాలతో సానుకూల ప్రభావం చూపడం పట్ల సంతోషంగా ఉన్నాము. కోవిడ్-19 తరువాత వేవ్స్‌కు ఇండియా సిద్ధమైన వేళ, బీద వర్గాలకు మరింత మద్దతు అవసరం. కమ్యూనిటీ ఆధారిత సంస్థల పరిజ్ఞానం, ప్రైవేట్ ప్లేయర్ల వనరులతో మేము మరిన్ని కమ్యూనిటీలను మా కార్యక్రమాల ద్వారా చేరుకోనున్నాం అని శివ్ కుమార్- చీఫ్ ఇంటిగ్రేటర్, కోవిడ్ యాక్షన్ కొల్లాబ్ అన్నారు.