Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీపీతోనే గుండెపోటు... నిర్లక్ష్యం చేస్తే అంతే...

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (09:40 IST)
ఇటీవలి కాలంలో గుండెపోటుతో చనిపోయేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇందులో రక్తపోటుతో బాధపడేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. రక్తపోటు (బీపీ) కారణంగానే గుండెపోటు వస్తున్నట్టు వైద్యులు అంటున్నారు. అయితే, బీపీని గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే గుండెపోటును నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 
 
తాజాగా, బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ వెల్లడించిన నివేదిక ప్రకారం రక్తపోటును సరైన సమయంలో గుర్తించి ట్రీట్‌మెంట్‌ తీసుకోకపోవడం కారణంగానే చాలా మంది చనిపోతున్నారు. సరైన చికిత్స అందిస్తే ఏటా 1.15 లక్షల మందిని కాపాడొచ్చు. ప్రపంచంలో లక్షలాది మందికి రక్తపోటు ఉందనే విషయం కూడా తెలియదు. గడిచిన కొన్నేళ్లలో ఎంతో మంది సరైన చికిత్స తీసుకోకపోవడంతో చనిపోయారు. 
 
అయితే.. రక్తపోటుపై అవగాహన లేక చికిత్సను నిరక్ల్యం చేస్తే వేలాది మంది చనిపోయే ప్రమాదం ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీన్ని నివారించాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, రక్తపోటుపై అవగాహన కల్పించాలని కోరారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు హెల్త్‌‌ చెకప్‌ చేయించుకోవాలి. కొందరికి రక్తపోటు ఉన్నా గుర్తించడం కష్టమని, ఆరోగ్యం హెల్త్ చెకప్‌ ద్వారా దీన్ని గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments