Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజూ వారి ఆహరంలో పాలకూర చేర్చుకుంటే...?

Advertiesment
lettuce
, మంగళవారం, 13 నవంబరు 2018 (12:22 IST)
ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర. పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి.
 
పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జ్వరం, పిత్త, వాయు శ్వాస సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది.
 
పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్స్ వంటి ఖనిజాలు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడుతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. ఈ కూరలో క్యాల్షియం, సోడియం, క్లోరిన్, ఫాస్ఫరస్, ఇనుము, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సీ‌ తదితరాలు ఉన్నాయి. 
 
స్త్రీల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను వెజిటబుల్ సూప్‌లోనూ, చపాతీలు చేసుకునే పిండిలోనూ, పకోడీల పిండిలోనూ, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ.. అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇతర ఆకుకూరల్లాగా పాలకూరను కూరలా, వేపుడు చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఎలాగైనా సరే ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాడు కాదంటే నేను ఆమెకు దగ్గరయ్యా.... ఇప్పుడు మళ్లీ కావాలంటున్నాడు... ఎలా?