Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిలబడి నీళ్ళు తాగితే ఏమవుతుందో తెలుసా? (Video)

"పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్న" అని మన పెద్దలు అపుడపుడూ చెబుతుంటారు. కానీ, నిలబడి నీళ్లు తాగడం కూడా ప్రమాదేనంటున్నారు ఆయుర్వేద శాస్త్రవేత్తలు. మనిషి మనుగడ సాగించాలంటే నీళ్లు తప్

Webdunia
గురువారం, 19 జులై 2018 (13:15 IST)
"పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్న" అని మన పెద్దలు అపుడపుడూ చెబుతుంటారు. కానీ, నిలబడి నీళ్లు తాగడం కూడా ప్రమాదేనంటున్నారు ఆయుర్వేద శాస్త్రవేత్తలు. మనిషి మనుగడ సాగించాలంటే నీళ్లు తప్పనిసరి. దాహం వేసినపుడల్లా నీరు తాగాల్సిందే. అయితే, ఆ నీరు తాగే పద్ధతిలో తాగితేనే ఆరోగ్యానికి మంచిదని, ఎలా పడితే అలా తాగితే రోగాల బారినపడే అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
* సాధారణంగా మనిషి శరీరంలో 60 శాతం నీళ్లే ఉంటాయి. అయితే, రోజువారి దినచర్యల వల్ల ఈ నీటి శాతం క్రమంగా తగ్గిపోతుంది. ఆ సమయంలో నీళ్లు తాగాలన్న సందేశాన్ని మెదడు అందిస్తుంది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా గటగటా నీరు తాగేస్తాం. 
 
* అలా నీరు తాగే సమయంలో మనం కూర్చొని ఉన్నామా? నిలుచొని ఉన్నామా? అనేది పట్టించుకోం. అయితే, నిల్చొని నీళ్లు తాగడం వల్ల రోగాల బారిన పడతామని, కూర్చొని తాగితేనే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
* నిల్చుని నీళ్లు తాగడం వల్ల మనం తాగే నీళ్లు ఎక్కువ వేగంతో అన్నవాహికలోకి వెళ్లి, పొత్తి కడుపులో భాగంలో బలంగా తాకుతుందట. పలు సందర్భాల్లో అలాగే తాగుతూ ఉంటే పొత్తి కడుపు గాయాలపాలై, పక్కనున్న అవయవాలు కూడా ప్రభావితమవుతాయట. 
 
* భవిష్యత్తులో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, కిడ్నీ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 
* ముఖ్యంగా, నిలబడి తాగడం వల్ల నీళ్లు అతి వేగంగా కిడ్నీల గుండా వెళ్తాయి. వడపోత సరిగా జరగదు. దాంతో మలినాలు రక్తంలో కలిసి రోగాలకు దారి తీస్తుందనీ, కిడ్నీల పనితీరు కూడా చెడిపోతుందని వారు వివరిస్తున్నారు. 
 
* మరీముఖ్యంగా కీళ్ల వద్ద ఉండే ద్రవాలు సంతులనం కోల్పోతాయని, దాంతో కీళ్లవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే వీలైనంత మేరకు కూర్చొని నీళ్లుతాగాని వారు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments