Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్తకు ఎడమ వైపున భార్య ఉంటే... శక్తి సామర్థ్యంగా....

సాధారణంగా వివిధ ప్రాంతాలలోని ఆలయాలను దర్శించినప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంటుంది. అమ్మవారితో సహా స్వామివారు వెలసిన ఆలయాల్లో ఆయనకి ఎడమ భాగంలోనే అమ్మవారు కొలువుదీరి ఉంటుంది. అలాగే దైవ సంబంధమైన కా

భర్తకు ఎడమ వైపున భార్య ఉంటే... శక్తి సామర్థ్యంగా....
, సోమవారం, 16 జులై 2018 (10:48 IST)
సాధారణంగా వివిధ ప్రాంతాలలోని ఆలయాలను దర్శించినప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంటుంది. అమ్మవారితో సహా స్వామివారు వెలసిన ఆలయాల్లో ఆయనకి ఎడమ భాగంలోనే అమ్మవారు కొలువుదీరి ఉంటుంది. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల్లోనూ, శుభకార్యలలోనూ భార్యభర్తలు పాలుపంచుకుంటున్నప్పుడు భర్తకి ఎడమవైపున మాత్రమే భార్య ఉండాలని పెద్దలు చెబుతుంటారు.
 
భార్యాభర్తలు ఫోటో దిగుతున్నా ఈ విషయాన్ని మాత్రం మరచిపోరు. ఈ ఆచారం భారతీయుల జీవన విధానంతో పెనవేసుకుపోయింది. పూర్వికులు ఏ పనిచేసిన అందులో ఒక అర్థం, పరమార్థం తప్పకుండా దాగివుంటుంది. కుడిభాగానికి ఉండే శక్తి సామర్థ్యాలు ఎడమభాగానికి అధికంగా ఉండవు. అందువలన ఎప్పటికప్పుడు ఎడమభాగానికి అదనపు శక్తి అవసరమవుతుంటుంది.
 
కుడిభాగాన్ని శివునికి సంకేతంగాను, ఎడమభాగం శక్తికి సంకేతంగాను చెబుతుంటారు. ఈ కుడి ఎడమల కలయికనే అర్థనారీశ్వర రూపమని అంటుంటారు. శరీరంలో ఎడమభాగం శక్తి భాగం కనుక భర్తకి ఎడమవైపున భార్య ఉండాలనే నియమాన్ని విధించారు. ఈ విధమైన ఆచారాన్ని పాటించడం వలన ఆలోచన ఆచరణ అనేవి సమపాళ్లుగా కలిసి జీవితాన్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయని విశ్వసిస్తుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోమవారం (16-07-2018) దినఫలాలు - ఒంటరిగానే లక్ష్యాలను..