Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుచ్చకాయల వైపు చూస్తున్నారా? ఐతే...

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (23:55 IST)
ఇప్పుడిప్పుడే పుచ్చకాయలు తొంగిచూస్తున్నాయి. మరోవైపు శీత గాలులు పోయి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనితో పుచ్చకాయలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. వేసవిలో దప్పిక తీర్చడానికి దీనికి మించిన పండు లేదు. నీటి శాతం, వేడి తగ్గించే గుణాలు దీనిలో అధికంగా ఉంటాయి.

 
ఇకపోతే పుచ్చకాయ దాహార్తిని తీరిస్తే... అందులో వుండే కానీ పుచ్చగింజలు ఎందుకూ పనికిరావని మనం పారేస్తాం. అయితే పుచ్చ గింజలను తింటే ఏమౌతుందని మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

 
పుచ్చకాయ గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. పుచ్చ గింజలలో ఉండే అమైనో ఆసిడ్స్ రక్త నాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా ఇవి పెంచుతాయి. 

 
ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో క్యాలరీలను శక్తిగా మార్చటంలో సహాయపడుతుంది. ఇందులో మోనోసాచ్యురేటెడ్, పాలీ అన్‌సాచ్యూరేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం అందించడంతోపాటు శరీరంలో కొలస్ట్రాల్ నిల్వలు లేకుండా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. పుచ్చకాయలో ఉండే లైకోపిన్ అనే పదార్ధం పురుషుల్లో వీర్యకణాల వృద్ధికి సహాయపడుతుంది. 

 
అంతేకాకుండా వీటిల్లో ఉండే ప్రొటీన్, అమైనో ఆసిడ్లు శరీరంలో రక్తపోటును తగ్గించటంలో చాలా బాగా సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్లో ఎల్ సిట్రులిన్ సమృద్ధిగా ఉండటం వలన కండరాలు బలంగా చేసేందుకు కండరాల కణజాలాన్ని రిపేర్ చేయటానికి బాగా సహాయపడుతుంది.

 
ఈ గింజల్లో ఉండే ఫోలేట్ లేదా ఫోలిక్ ఆసిడ్ మెదడు పనితీరులో సహాయపడటమే కాకుండా ఫ్రీ రాడికల్స్ బారి నుండి మెదడును రక్షిస్తుంది. పుచ్చగింజల్ని నీటిలో వేసి మరిగించి టీ లా తాగడం వలన కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి కండరాల కదలికల క్రమబద్దీకరణలో పుచ్చగింజలు తోడ్పడుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

తర్వాతి కథనం
Show comments