Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుచ్చకాయలను ఎప్పుడు తినకూడదో తెలుసా?

పుచ్చకాయలను ఎప్పుడు తినకూడదో తెలుసా?
, శనివారం, 6 మార్చి 2021 (19:40 IST)
వేసవి రాగానే పుచ్చకాయలు వచ్చేస్తాయి. ఐతే ఈ పుచ్చకాయలను పడుకునే ముందు రాత్రి పూట తినకూడదని సిఫార్సు చేయబడింది. రాత్రి 7 గంటల తర్వాత పుచ్చకాయ లేదా ఏదైనా పండ్ల వినియోగాన్ని చేయకుండా వుండటమే మంచిదని నిపుణులు చెపుతున్నారు. పుచ్చకాయ కొద్దిగా ఆమ్లంతో కూడి ఉంటుంది, అందువల్ల రాత్రిపూట తీసుకుంటే, శరీరం క్రియారహితంగా ఉన్నప్పుడు జీర్ణక్రియ ప్రక్రియ ఆలస్యం కావచ్చు.
 
పుచ్చకాయ ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే... వీటి గింజలు ఐరన్, పొటాషియం మరియు విటమిన్ల‌తో నిండి ఉంటాయి. పుచ్చపండుతో పాటు గింజలను తినడం వలన అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పుచ్చపండులో గల పోషక విలువలేమిటో చూద్దాం.
 
అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. ఎండిపోయే పెదవులు తడిగా ఉంచుతుంది.
 
పుచ్చకాయలో ఉన్నన్ని నీళ్ళు మరే పండులోగాని, కాయలోగాని లేవు. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చపండు గింజలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి యవ్వనంగా కనపడేలా చేస్తాయి. అంతేకాకుండా, ఈ విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్ మరియు ఇన్ఫెక్షన్ వంటి చర్మ రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.
 
పుచ్చకాయ తినడం వలన మగవారిలో స్తంభన సమస్యలు రావని పరిశోధనలు చెబుతున్నాయి. పుచ్చకాయలోని సిట్రులైన్, ఆర్గినైన్ పదార్దాల వలన ఈ సమస్య తగ్గుతుంది. బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. 
 
గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్‌ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి. పుచ్చపండు గింజలు మెగ్నీషియంను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ మూలకం గుండె విధిని మరియు రక్త పీడనాన్ని సమతుల్య పరుస్తుంది. ఇవే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్‌లను తగ్గించి, జీవక్రియకు సజావుగా జరుగుటలో సహాయపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#IWD2021: మగువా నీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవా..?