Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లు అలా వుంటే అనారోగ్యం... ఎలా వుంటే ఏమేమిటి?

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (13:15 IST)
మనలో చాలామంది హెల్త్ చెకప్ అంటూ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. ఐతే ఈ హెల్త్ చెకప్స్ అందరూ చేయించుకోలేరు కదా. అలాంటివారు తమ ఆరోగ్య స్థితిని వారి కళ్లను చూసి తెలుసుకోవచ్చంటున్నారు వైద్యులు. అదెలాగో చూద్దాం.
 
నిప్పు కణాల్లా కళ్లు ఎర్రగా ఉంటే...
కొందరి కళ్లను చూసినప్పుడు నిప్పు కణాల్లా ఎర్రగా ఉంటాయి. వైద్యుడు పరీక్షించి చూస్తే రెటీనా పైన చిన్నచిన్న రక్త కణాలు కనబడుతాయి. దీనికి కారణం అధిక రక్తపోటు. అధిక రక్తపోటు కారణంగా కంటిలోని నరాలు ఇలా ఎర్రగా మారుతాయి. కొన్నిసార్లు అవి పగిలిపోవడం కూడా జరుగుతుంది. దాంతో కళ్లు ఎర్రగా కనబడుతాయి. ఐతే ఈ విషయం అధిక రక్తపోటు కలిగిన నాలుగో వంతు మందికి తెలియదు. ఇలాంటి వారు గుండెపోటుకు గురయ్యే అవకాశాలుంటాయి. అందువల్ల కళ్లు ఎర్రబడితే.. ఆ ఏం జరుగుతుందిలే అని వదిలేయకూడదు.
 
కంటి వెనుక భాగంలో పసుపుగా ఉంటే... మధుమేహం
కొందరికి కనులలో పసుపు పచ్చగా కొవ్వు ఉన్నట్లు కనబడుతుంది. లేదంటే రెటీనా చిన్నచిన్న నీటిబొట్లు ఉన్నట్లు కనబడుతుంది. ఇలాంటివారిలో టైప్ 2 డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 
 
కళ్లు పసుపు పచ్చగా ఉంటే...
కొందరి కళ్లు పసుపు పచ్చగా అగుపిస్తాయి. అలాంటివారిలో కాలేయ సమస్య ఉందని గుర్తించాలి. కళ్లు ఇలా మారిపోవడానికి కారణం కాలేయం పనితీరులో తేడా ఉండటమే. అందువల్ల వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే తగు సలహాలు తీసుకుని ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments